
బేగంపేటలోని ఒక ప్రైవేట్ ఏవియేషన్ సంస్థలో పైలట్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ల యువతిపై, అదే సంస్థలో కమర్షియల్ పైలట్‌గా ఉన్న 60 ఏళ్ల రోహిత్ శరణ్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ విషయంలో యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక ప్రైవేట్ ఏవియేషన్ సంస్థ ఉద్యోగలు పని మీద ఇద్దరూ ఇటీవల బెంగళూరుకు వెళ్లారు. అక్కడ వారికి ఏర్పాటు చేసిన హోటల్ గదిలో రోహిత్ శరణ్ ఆమెపై లైంగికి దాడికి ప్రయత్నించాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. పరిస్థితిని అంచనా వేసి, వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న ఆమె బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ సైదులు తెలిపారు.
ప్రాథమిక విచారణ అనంతరం.. ఘటన బెంగళూరు హలసూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీంతో కేసును అక్కడికే బదిలీ చేసినట్లు బేగంపేట్ పోలీసులు తెలిపారు. రోహిత్ శరణ్‌పై సంబంధిత సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసి, దర్యాప్తును హలసూరు పోలీసులు కొనసాగిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..