తెలంగాణ కొత్త సర్కార్‌లో తాను పెద్దన్న పాత్ర పోషిస్తానంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు. ఆరు గ్యారంటీలు అమలు అయ్యేలా చూస్తానంటున్నారు. తెలంగాణలో కొలువుదీరుతున్న కాంగ్రెస్ సర్కార్‌లో తనది పెద్దన్న పాత్ర అంటున్నారు సీనియర్ నేత వీహెచ్. ఆరు గ్యారంటీలు అమలు చెయ్యకపోతే ఊరుకోనంటున్నారు ఆయన. ఆరు గ్యారంటీల అమలులో తేడాలు వస్తే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానంటున్నారు వీహెచ్.
తెలంగాణలో విజయం కోసం రేవంత్ రెడ్డి చేసిన కృషిని కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించిందని సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. అధిష్ఠానం మాటను ధిక్కరించే సంప్రదాయం కాంగ్రెస్‌లో లేదని స్పష్టం చేశారు. సోనియా గాంధీ నిర్ణయంతోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని వి. హనుమంత రావు స్పష్టం చేశారు. అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని, మంత్రి వర్గ కూర్పు విషయంలో సామాజిక న్యాయం జరుగుతుందని భావిస్తున్నానన్నారు వీహెచ్. వీహెచ్ పెద్దన్న పాత్ర…ఎలా ఉంటుందో చూడాలి.