Viral Video: పొలంలో 5 అడుగుల భారీ నాగుపాము.. భయంతో పరుగులు పెట్టిన రైతులు..

|

Aug 23, 2021 | 4:45 PM

సోషల్ మీడియాలో అనేక వైరల్ వీడియోలను మనం చూస్తూనే ఉంటాం. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని..

Viral Video: పొలంలో 5 అడుగుల భారీ నాగుపాము.. భయంతో పరుగులు పెట్టిన రైతులు..
Snake
Follow us on

సోషల్ మీడియాలో అనేక వైరల్ వీడియోలను మనం చూస్తూనే ఉంటాం. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. ఇలాంటి కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

ఈ మధ్యకాలంలో నాగుపాములు తరచూ జనావాసాల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. పామును దూరం నుంచి చూస్తేనే భయంతో వణికిపోతాం. అలాంటిది మనకు దగ్గరలో ఉంటే ఇంకేమైనా ఉందా.? గుండె ఆగినంత పనవుతుంది. సరిగ్గా ఇదే పరిణామం కొంతమంది రైతులకు ఎదురైంది.

నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నళేశ్వర్ గ్రామానికి చెందిన రైతైన పోశెట్టి పొలంలో రెండు రోజులుగా 5 అడుగుల భారీ నాగుపాము సంచరిస్తున్నట్లు కొంతమంది రైతులు గుర్తించారు. అందులో పని చేసేందుకు భయభ్రాంతులకు గురై.. నందిపేటకు చెందిన స్నేక్ క్యాచర్ సర్వర్ ఖాన్‌కి సమాచారం అందించారు. ఆయన పొలం వద్దకు వచ్చి సుమారు ఐదు అడుగుల నాగు పాముని చాకచక్యంగా పట్టి పాలిథిన్ డబ్బాలో బంధించారు. ఆ తర్వాత అటవిశాఖ అధికారులకు అందజేశారు. కాగా, పామును పట్టుకోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

(ప్రభాకర్, నిజామాబాద్, టీవీ9)