Telangana: జ్యోతిబా పూలే గురుకులంలో కరోనా కలకలం.. 27 మంది విద్యార్థినులకు పాజిటివ్..

|

Dec 02, 2021 | 9:13 PM

Mahatma Jyotiba Phule Residential School: కరోనావైరస్ సెకండ్ వేవ్ అనంతరం ఇప్పుడిప్పుడే మహమ్మారి కేసుల సంఖ్య తగ్గుతోంది. ఈ క్రమంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి సృష్టిస్తోంది. తోంపాటు పెరుగుతున్న

Telangana: జ్యోతిబా పూలే గురుకులంలో కరోనా కలకలం.. 27 మంది విద్యార్థినులకు పాజిటివ్..
Students
Follow us on

Mahatma Jyotiba Phule Residential School: కరోనావైరస్ సెకండ్ వేవ్ అనంతరం ఇప్పుడిప్పుడే మహమ్మారి కేసుల సంఖ్య తగ్గుతోంది. ఈ క్రమంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి సృష్టిస్తోంది. తోంపాటు పెరుగుతున్న కరోనా కేసులు భయభ్రాంతులకు గురిచేస్తోంది. అయితే.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలు, గురుకులాల్లో చదివే విద్యార్థులు ఇప్పటికే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెర్వు మండలం ఇంద్రేశంలోని జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయంలో కరోనా కలకలం రేపింది. గురుకులంలో ఉన్న 300 మంది విద్యార్థినులకు కరోనా పరీక్షలు చేయగా.. ఇందులో 27 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు గురువారం వెల్లడించారు. దీంతో విద్యార్థులందరినీ గురుకులంలోనే ఐసోలేషన్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. పాఠశాలలో మొత్తం 900 మంది విద్యార్థులు ఉన్నారు. మిగతా విద్యార్థినులకు శుక్రవారం కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు సంగారెడ్డి జిల్లా వైద్యాధికారి గాయత్రిదేవి ప్రకటనలో తెలిపారు.

ముత్తంగి గురుకులంలో 43 మందికి..
ఇదిలాఉంటే.. రెండు రోజుల క్రితం పటాన్‌చెరువు మండలంలోని ముత్తంగి గురుకుల పాఠశాలలోని 42 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయురాలు కరోనా బారినపడ్డారు. గురుకుల పాఠశాలలో 491 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, 27 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో మొత్తం 43 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. కరోనా సోకిన విద్యార్థులను వసతి గృహంలోనే క్వారంటైన్‌లో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మూడు రోజుల క్రితం ఓ విద్యార్థిని అస్వస్థతకు గురి కావడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతకుముందు ఖమ్మం జిల్లాలోని వైరా బాలికల పాఠశాలలో 30 మంది విద్యార్థినులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

Also Read:

Viral Video: రన్‌వేపై విమానాన్ని నెడుతున్న జనం.. వీడియో చూసి పొట్ట చక్కలయ్యేలా నవ్వుకుంటున్న నెటిజన్లు..

Viral Video: ఏనుగుల ప్రాంతానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్న టూరిస్ట్‌లు.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..