మూగ తల్లి, తండ్రి మరణం.. కుంగదీసిన ఆర్థిక పరిస్థితి.. బలవన్మరణానికి పాల్పడ్డ 18ఏళ్ల కుర్రాడు..!

హైదరాబాద్ నగరం పంజాగుట్ట పరిధిలోని నిమ్స్ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ బాధ్యతల ఒత్తిడి తట్టుకోలేక నిమ్స్ సిబ్బంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. జార్ఖండ్‌కు చెందిన 18 ఏళ్ల బికాష్ కుమార్ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలాడు. నిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

మూగ తల్లి, తండ్రి మరణం.. కుంగదీసిన ఆర్థిక పరిస్థితి.. బలవన్మరణానికి పాల్పడ్డ 18ఏళ్ల కుర్రాడు..!
Young Man Suicide

Updated on: Feb 12, 2026 | 2:12 PM

హైదరాబాద్ నగరం పంజాగుట్ట పరిధిలోని నిమ్స్ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ బాధ్యతల ఒత్తిడి తట్టుకోలేక నిమ్స్ సిబ్బంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. జార్ఖండ్‌కు చెందిన 18 ఏళ్ల బికాష్ కుమార్ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలాడు. నిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో విషాదగాథ వెలుగులోకి వచ్చింది.

జార్ఖండ్‌కు చెందిన బికాష్ కుమార్ తండ్రి మరణంతో కుటుంబ బాధ్యతలు చేపట్టాడు. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. నిమ్స్ ఆసుపత్రిలో రోజు వారి కూలీగా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బికాష్ కుమార్‌కు మాటలు రాని తల్లి, పదేళ్ల తమ్ముడు ఉన్నట్లు తోటి కూలీలు తెలిపారు. కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత అతనిపై ఉండంతో సొంత రాష్ట్రమైన జార్ఖండ్ నుండి హైదరాబాద్‌ లస వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

కుటుంబ పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులు బికాష్ కుమార్‌ను కుంగదీశాయి. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన బికాష్, చివరికి ఆత్మహత్యకు ఒడిగట్టాడు. మంగళవారం (ఫిబ్రవరి 10) అర్ధరాత్రి తాను పనిచేస్తున్న నిమ్స్ ఆసుపత్రిలోని బాత్రూమ్‌లో ఇనుప రాడ్డుకు లుంగీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తోటి కూలీలు ఇచ్చిన సమాచారం మేరకు పంజాగుట్ట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బికాష్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us