Viral Video: ఆ గ్రామంలో రాత్రికి రాత్రే మిస్సవుతున్న కోళ్లు, మేకలు.. ఏం జరుగుతుందని నిఘా పెట్టగా..

ఆ గ్రామంలో గత కొన్ని కోళ్లు, మేక పిల్లలు మిస్సవుతున్నాయి. రాత్రి ఇంటి ముందు ఉన్న కొటంలో కనిపించిన కోళ్లు, మేకలు ఉదయానికి కనిపించకుండా పోతున్నాయి. దీంతో అసలు గ్రామంలో ఏం జరుగుతుందో ఎవరీ అర్థం కాలేదు. కానీ ఒక రోజు తెల్లవారుజామున స్థానికులకు కనిపించిన ఓ సీన్ అందరినీ తీవ్ర భాయందోళనకు గురిచేసింది. వాళ్లకు అప్పుడ అర్థమైంది.. గ్రామంలో ఉన్న పెంపుడు జంతువులు ఏమవుతున్నాయని. ఇంతకూ ఆ సీన్ ఏంటనేగా మీ డౌట్.. అది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

Viral Video: ఆ గ్రామంలో రాత్రికి రాత్రే మిస్సవుతున్న కోళ్లు, మేకలు.. ఏం జరుగుతుందని నిఘా పెట్టగా..
12 Foot Python Killed In Marriguda

Edited By:

Updated on: Sep 17, 2026 | 8:00 AM

ఆ గ్రామంలో రాత్రయితే చాలు కోళ్లు, మేకల అరుపులు.. ఉదయం చూస్తే కనిపించని వాటి జాడ.. గత కొన్ని ములుగు జిల్లా వెంకటాపురం మండలం మర్రిగూడెం గ్రామంలో ఇదే జరుగుతుంది. అవును రాత్రి వేల గ్రామంలోకి ప్రవేశించి కోళ్లు, మేకలను మింగేస్తోందో కొండచిలువ. తాజాగా బుధవారం తెల్లవారుజామున గ్రామంలోకి వచ్చిన కొండచిలువను గమనించిన స్థానికులు.. దాన్ని కర్రలతో కొట్టి హతమార్చారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. కొండచిలువ గ్రామంలోకి ప్రవేశించి హల్ చల్ చేసిన ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం మర్రిగూడెం గ్రామంలో జరిగింది. తెల్లవారుజామున గ్రామంలోకి ప్రవేశించిన 12 అడుగుల భారీ కొండచిలువ.. ఎప్పటిలాగే కోళ్లను మింగేందుకు ప్రయత్నించింది.. కొండచిలువను చూసి కోళ్లు, మేకలు అరవడం గమనించిన గ్రామస్తులు అలెర్ట్ అయ్యారు.. ఈ క్రమంలో పరిసరాలను పరిశీలిస్తే మూగ జీవులను మింగేందుకు ప్రయత్నిస్తున్న బారీ కొండచిలువ కనిపించింది. దాన్ని చూసిన స్థానికులు తొలుత ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.

ఇలా అయితే తమ పెంపుడు జీవులు తమకు దక్కవని నిర్ణయించుకున్న గ్రామస్థులు ధైర్యం చేసి.. కోళ్లను మింగేందుకు ప్రయత్నించే తరుణంలో కొండ చిలువను కర్రలతో కొట్టి హతమార్చారు. గత కొద్దిరోజుల నుండి ఈ కొండచిలువే గ్రామంలోని కోళ్లు, మేకలను మింగేస్తుందని భావిస్తున్నారు గ్రామస్తులు. ఇప్పుడు దాన్ని హతమార్చడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us