AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హెడ్మాస్టర్ మందలించాడని మనస్థాపం.. 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!

జగిత్యాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ విద్యార్థి ఆత్మహత్య ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు మందలించాడనే మనస్థాపంతో పదవ తరగతి చదువుతున్న దుగ్గిళ్ళ అక్షయ్ బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపుతోంది. అక్షయ్ మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతుండగా, గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి నివాళులర్పించారు.

హెడ్మాస్టర్ మందలించాడని మనస్థాపం.. 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
Class Room
G Sampath Kumar
| Edited By: |

Updated on: Apr 10, 2026 | 5:30 PM

Share

జగిత్యాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ విద్యార్థి ఆత్మహత్య ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు మందలించాడనే మనస్థాపంతో పదవ తరగతి చదువుతున్న దుగ్గిళ్ళ అక్షయ్ బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపుతోంది.

రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన అక్షయ్ స్థానిక పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. చదువులో సాధారణంగా ఉన్నప్పటికీ, ఇటీవల పాఠశాలలో జరిగిన ఒక సంఘటన అతని జీవితాన్ని మలుపు తిప్పింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహన్ రెడ్డి ఏదో కారణంతో అక్షయ్‌ను మందలించినట్లు సమాచారం. ఈ మందలింపును అక్షయ్ తీవ్రంగా తీసుకుని మానసికంగా కుంగిపోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఈ ఘటన అనంతరం ఇంటికి వెళ్లిన అక్షయ్ తీవ్ర మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స అందించిన వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. చికిత్స పొందుతూ అక్షయ్ మృతి చెందాడు.

అక్షయ్ మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతుండగా, గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి నివాళులర్పించారు. చిన్న వయసులోనే చదువులో ముందుకు సాగాల్సిన బాలుడు ఇలా ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. ఈ ఘటనతో పాఠశాలల్లో విద్యార్థులపై మానసిక ఒత్తిడి, క్రమశిక్షణ పేరుతో చేసే మందలింపుల ప్రభావంపై విద్యార్థుల భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకోకుండా కఠినంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us