Zebronics Smartwatch: జీబ్రోనిక్స్ నుంచి సరికొత్త స్మార్ట్ వాచ్.. ధర, ఫీచర్లు చూస్తే వాహ్ అనాల్సిందే..!!

| Edited By: Janardhan Veluru

Feb 11, 2023 | 3:25 PM

ఇప్పుడంతా స్మార్ట్ యుగం నడుస్తోంది. ఈ స్మార్ట్ టెక్నాలజీతో వినియోగదారులు కూడా మరింత స్మార్ట్ గా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. స్మార్ట్ మొబైల్స్‎తోపాటు స్మార్ట్‎వాచీలపై కూడా వ్యామోహం పెరిగింది.

Zebronics Smartwatch: జీబ్రోనిక్స్ నుంచి సరికొత్త స్మార్ట్ వాచ్.. ధర, ఫీచర్లు చూస్తే వాహ్ అనాల్సిందే..!!
Zebronics
Follow us on

ఇప్పుడంతా స్మార్ట్ యుగం నడుస్తోంది. ఈ స్మార్ట్ టెక్నాలజీతో వినియోగదారులు కూడా మరింత స్మార్ట్ గా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. స్మార్ట్ మొబైల్స్‎తోపాటు స్మార్ట్‎వాచీలపై కూడా వ్యామోహం పెరిగింది. ఇప్పుడు స్మార్ట్‎వాచ్ ఒక గాడ్జెట్‎లా మారి ప్రజలకు చేరువైంది. కేవలం సాంకేతిక పరిజ్ఞానంలోనే కాదు..ఆరోగ్యంలో కూడా ముందుంటుంది. ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. దీంతో కంపెనీలు స్మార్ట్‎ఫోన్లతోపాటు స్మార్ట్‎వాచ్‎లకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నాయి.

అమేజ్ ఫిట్, ఎంఐ, హానర్, ఫాస్ట్ ట్రాక్,ఆపిల్, బోల్ట్ వంటి కంపెనీలు స్మార్ట్‎వాచ్‎లతో మార్కెట్లో తమ మార్క్ వేశాయి. ఈ మధ్యే జెట్ ఫిట్ స్మార్ట్‎వాచ్ పరిచయం చేసింది. ఈ కంపెనీకి మార్కెట్లో మంచి పేరును తెచ్చిపెట్టింది. ఇప్పుడు జీబ్రోనిక్స్ నుంచి వచ్చిన ఈ జీబ్రోనిక్స్ ఐకానిక్ ఆల్ట్రా స్మార్ట్‎వాచ్ ఎలా ఉంది…దాని ఫీచర్స్ ధర ఎలా ఉందో తెలుసుకుందాం.

జీబ్రోనిక్స్ ఐకానిక్ ఆల్ట్రా స్మార్ట్‎వాచ్ 2.5డి లామినేటెడ్ స్క్రీన్‌తో 1.78-అంగుళాల ఆల్మోడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఎప్పుడూ ఆన్‌లో ఉండే డిస్‌ప్లే ఫీచర్ వినియోగదారుని వాచ్ సైలెండ్ మోడ్‌లో ఉన్నప్పుడు కూడా వాచ్‌ని ఉపయోగించుకునేలా చేస్తుంది. ఈస్మార్ట్‎వాచ్ 100 స్పోర్ట్స్ మోడ్‌‎లను ఇచ్చింది. SPO2, స్లీప్ ట్రాకింగ్, హృదయ స్పందన రేటు, రక్తంలో ఆక్సిజన్ స్థాయిని ఈ స్మార్ట్‎వాచ్‌లో పర్యవేక్షించవచ్చు.

ఇవి కూడా చదవండి

జీబ్రోనిక్స్ ఐకానిక్ ఆల్ట్రా స్మార్ట్‎వాచ్ లో మహిళల పీరియడ్స్ ట్రాకింగ్‎ను ట్రాక్ చేసే స్పెషల్ ఫీచర్ ఉంది. ఈ స్మార్ట్‎వాచ్ మహిళ ఆరోగ్యానికి సంబంధించి పూర్తి పర్యవేక్షణగా ఉంటుంది. మెటల్ బాడీపై ఉన్న ఫంక్షనల్ క్రౌన్ ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. వినియోగదారులు వాచ్‌ను సులభంగా నావిగేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇందులో ఇంటర్నల్ స్పీకర్‌ కూడా ఉంది. మైక్‌లో బ్లూటూత్ V 5.1 + V 3.0 అమర్చబడి ఉంది. ఈ ఫోన్లో కాల్ తోపాటు ఇన్‎కమింగ్ నోటిఫికేషన్లను చూడవచ్చు. కెమెరా, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్లు కూడా ఉన్నాయి. స్మార్ట్ వాచ్ సైక్లింగ్, రన్నింగ్, వినియోగదారుల కార్యాచరణను దృష్టిలో ఉంచుకోవడం వంటి కొత్త లక్షణాలను కలిగి ఉంటుంది.

ఇది గూగుల్, సిరి వంటి వాయిస్ అసిస్టెంట్ లకు కూడా సపోర్టు చేస్తుంది. IP67 రేటింగ్‌తో వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌వాచ్, ఇది 260 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 30 రోజుల వరకు అద్భుతమైన స్టాండ్-బై సమయాన్ని అందిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ఆరెంజ్, బ్లాక్ కలర్ ఆప్షన్‌లో ఇన్ఫినిటీ లూప్ సిలికాన్ బ్యాండ్‌లతో వస్తుంది. ఇప్పుడు ఈ స్మార్ట్ వాచ్ ధర గురించి మాట్లాడితే కంపెనీ స్మార్ట్‎వాచ్ కు రూ. 3,299ధర నిర్ణయించింది. ఈ వాచ్‎ను అమెజాన్ ఇండియా నుంచి కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..