Youtube: ఇకపై అలా చేయడానికి కుదరదు.. కీలక నిర్ణయం తీసుకున్న యూట్యూబ్‌.. ఫీచర్‌లో మార్పులు..

|

Nov 11, 2021 | 6:29 PM

Youtube: యూట్యూబ్‌ పేరు తెలియని వారు ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. తెలిసిన వంటకాలను సైతం మళ్లీ యూట్యూబ్‌లో చూసి చేస్తోన్న రోజులివీ. స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను ఓపెన్‌ చేస్తున్నారు...

Youtube: ఇకపై అలా చేయడానికి కుదరదు.. కీలక నిర్ణయం తీసుకున్న యూట్యూబ్‌.. ఫీచర్‌లో మార్పులు..
Youtube Feature
Follow us on

Youtube: యూట్యూబ్‌ పేరు తెలియని వారు ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. తెలిసిన వంటకాలను సైతం మళ్లీ యూట్యూబ్‌లో చూసి చేస్తోన్న రోజులివీ. స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను ఓపెన్‌ చేస్తున్నారు. వీడియోలను అప్‌లోడ్‌ చేస్తున్నారు. అంతలా యూట్యూబ్‌ మన జీవితంలో ఓ భాగమైపోయింది. దీంతో యూట్యూబ్‌ వేదికగా లక్షల వీడియోలు అప్‌లోడ్‌ అవుతున్నాయి. సినిమా వాళ్లు కూడా ట్రైలర్‌లు, టీజర్‌లను ఇందులోనే విడుదల చేస్తున్నారు. అయితే అందరికీ ఉపయోగపడుతోన్న యూట్యూబ్‌ కొందరికి మాత్రం కష్టాలను తెచ్చి పెడుతోంది. యూట్యూబ్‌లో లైక్‌ ఆప్షన్‌ ఉన్నట్లే.. డిజ్‌లైక్‌ అనే ఆప్షన్‌ కూడా ఉంటుంది.

దీంతో కొందరు ఉద్దేశపూర్వకంగానే డిజ్‌లైక్‌ ఆప్షన్‌ను అదే పనిగా నొక్కుతున్నారు. గతంలో ఓసారి టాలీవుడ్‌కు చెందిన హీరో విషయంలో ఇలాగే జరిగింది. కొందరు పనిగట్టుకొని సదరు హీరో ట్రైలర్‌పై డిజ్‌లైక్‌ల వర్షం కురిపించారు. అయితే ఈ సమస్య కేవలం టాలీవుడ్‌కు, తెలుగు వారికి మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉంది. డిజ్‌లైక్‌ల కారణంగా కొందరు యూట్యూబర్లు ఆదాయాన్ని కూడా కోల్పోవాల్సి వస్తోంది. ముఖ్యంగా డిజ్‌లైక్‌ల సంఖ్య ఆధారంగా ఛానల్‌ చూసే యూజర్లు కూడా తగ్గిపోతున్నారు.

దీనిని దృష్టిలో పెట్టుకొని యూట్యూబ్‌ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒక వీడియోకు ఎన్ని డిజ్‌ లైక్‌లు వచ్చాయన్న దానిని యూజర్లకు కనిపించకుండా చేయనుంది. అంటే డిజ్‌లైక్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది. కానీ.. ఆ సంఖ్య మాత్రం యూజర్లకు కనిపించదన్నమాట. ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

Also Read: Aadhaar: ఆధార్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా !! వీడియో

Viral Video: మొసలి నవ్వడం ఎప్పుడైనా చూశారా..! వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు.

తేనె-లవంగాలతో ఆరోగ్యం మీ సొంతం.. ఈ రోగాలకు చెక్‌ పెట్టండి !! వీడియో