Xiaomi: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విపరీతమైన పోటీ ఏర్పడింది. పోటీపడీ మరీ కంపెనీలు తమ బ్రాండ్స్‌ను ప్రజల్లోకి తీసుకెళుతున్నాయి. తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ ప్రత్యేకంగా భారత వినియోగదారుల కోసం ఓ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. యూట్యూబ్‌తో కలిసి యూజర్లకు ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది.
ఎంపిక చేసిన కొన్ని షావోమీ బ్రాండ్స్‌పై దేశీయంగా యూట్యూబ్ ప్రీమియం సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తోంది. మొదటి మూడు నెలలు యూజర్లకు ఉచితంగా సబ్‌స్క్రిప్షన్ అందించనున్నారు. షావోమి 11, షావోమీ 12 ప్రో, షావోమీ 11టి,11 ఐ ఫోన్లపై మొదటి మూడు నెలలు, రెడ్‌మి నోట్ 11, నోట్ 11 ఎస్ వాటిపై రెండు నెలల సబ్‌స్ర్రిప్షన్ ఉచితంగా పొందొచ్చు. ఈ ఆఫర్ జనవరి 31, 2023 వరకు అందుబాటులో ఉంటుంది. ఇదిలా ఉంటే యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కోసం యూజర్లు ప్రస్తుతం నెలకు రూ. 129 చెల్లించాల్సి ఉంది.
యూట్యూబ్ ప్రీమియం ద్వారా లభించే ప్రత్యేక ఫీచర్లు ఇవే..
* ప్రీమియమ్ సబ్‌స్క్రైబర్ల కోసం యూట్యూబ్ ప్రత్యేక కంటెంట్‌ను అందిస్తోంది. వెబ్ సిరీస్‌లు, షోలతో పాటు ప్రత్యేకమైన ఒరిజినల్ ఉంటాయి.
* యూబ్యూట్ ప్రీమియం తీసుకున్న వారు యాడ్స్ లేకుండా వీడియోలు చూసుకోవచ్చు.
* యూట్యూబ్ యాప్ నుంచి బయటకి వచ్చినా బ్యాక్‌గ్రౌండ్‌లో ఆడియో వినొచ్చు. అంతేకాకుండా డిస్‌ప్లేపై పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌లో వీడియోలను చూసుకోవచ్చు.
* యూట్యూబ్ మ్యూజిక్ ఉచితంగా పొందొచ్చు. అలాగే ప్రీమియం తీసుకున్న వారు ఆఫ్‌లైన్‌లో వీడియోలను 720P, 1080P వంటి హైరెజల్యూన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..