Xiaomi 13 Pro: భారత్‎లో షియోమీ 13 ప్రో.. లాంచ్ డేట్ రిలీజ్..ధర, ఫీచర్స్ చూస్తే వావ్ అంటారు..!!

షియోమీ కంపెనీ నుంచి త్వరలోనే భారత మార్కెట్లో మరో సరికొత్త స్మార్ట్‎ఫోన్ రిలీజ్ కానుంది. Xiaomi 13 Pro పేరుతో రిలీజ్ అవుతున్న ఈ స్మార్ట్‎ఫోన్‎ను ఫిబ్రవరి 26న రాత్రిం 9:30లకు గ్రాండ్ ఈవెంట్‎లో లాంచ్ చేయనుంది.

Xiaomi 13 Pro:  భారత్‎లో షియోమీ 13 ప్రో.. లాంచ్ డేట్ రిలీజ్..ధర, ఫీచర్స్ చూస్తే వావ్ అంటారు..!!
Xiaomi 13 Pro

Edited By: Janardhan Veluru

Updated on: Feb 09, 2023 | 6:45 PM

షియోమీ కంపెనీ నుంచి త్వరలోనే భారత మార్కెట్లో మరో సరికొత్త స్మార్ట్‎ఫోన్ రిలీజ్ కానుంది. Xiaomi 13 Pro పేరుతో రిలీజ్ అవుతున్న ఈ స్మార్ట్‎ఫోన్‎ను ఫిబ్రవరి 26న రాత్రిం 9:30లకు గ్రాండ్ ఈవెంట్‎లో లాంచ్ చేయనుంది. ఈవెంట్‎ను ఫేస్‎బుక్, యూట్యూబ్, ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ ఈవెంట్ ద్వారా ఫోన్ అధికారికంగా భారత్‎లోకి అడుగపెట్టనుంది. ఈ స్మార్ట్‎ఫోన్ గతేడాది డిసెంబర్ లో చైనాలో రిలీజ్ అయ్యింది. అక్కడ ఈ ఫోన్ ధర రూ. 61,000 వరకు ఉంది. భారత్ లో ఇంకా తక్కువ ధరకు లభించే అవకాశం ఉందని లీక్స్ ను బట్టి తెలుస్తోంది. షియోమీ 13ప్రో కంపెనీ నుంచి వచ్చే ఈ సరీస్ ఫోన్లు ఫ్లాగ్‎షిప్ స్మార్ట్‎ఫోన్లలలో అగ్రస్థానంలో ఉంటుంది.

ఫీచర్లు:

ఇక ఫీచర్ల విషయానికొస్తే…షియోమీ 13 ప్రో సరికొత్త క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8జెన్ 2 ఎస్ఓసి ప్రాసెసర్ తో రన్ అవుతుంది. గరిష్టంగా 12జీబీ ర్యామ్, 512జిబి ఇంటర్నల్ స్టోరేజీతో జత చేయబడింది. ఈ ఫోన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్ సపోర్టుతో 6.78-అంగుళాల 2K డిస్‌ప్లేతో వస్తుంది. ఇది బ్యాక్ 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కోసం 1 ఇంచు సోనీ IMX989 సెన్సార్‌తో పనిచేస్తుంది. దీనికి జతగా, 50మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్, 5మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్ కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

కాగా ఈ ఫోన్ 120వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతునిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్లో 4820ఎంహెఏచ్ బ్యాటరీ ఉంటుంది. వన్‌ప్లస్ తన ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 11ని తక్కువ ధరకు విడుదల చేయడంతో…ఇప్పుడు రాబోయే ఈ కొత్త షియోమీ ఫోన్‎పై ఎంత ధర ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఫోన్ డివైస్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14లో రన్ అవుతుంది. కానీ భారత్ లో ఈ మొబైల్ ధర ఇంకా లీక్ కాలేదు. వన్ ప్లస్ తన స్మార్ట్ ఫోన్ 11ను భారత్ లో తక్కువ ధరకే విడుదల చేసిన సంగతి తెలిసిందే. దానికి పోటీకి రిలీజ్ అవుతున్న షియోమీ 13 ప్రో స్మార్ట్ ఫోన్ ఎంత ధరతో లాంచ్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ కోసం