
ప్రముఖ సోషల్ మీడియా సైట్ ట్విట్టర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెలబ్రిటీలు ఎక్కువగా ఉపయోగించే ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ‘ఎక్స్’ పేరుగా మార్చారు. అనంతరం ఎన్నో రకాల కొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను మరింత పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యూజర్లకు సరికొత్త ఎ్స్‌పీరియన్స్‌ను అందించే దిశగా ఎక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎక్స్‌లో కేవలం ట్వీట్స్ మాత్రమే మాత్రమే కాకుండా ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే సదుపాయం కల్పించారు.
ఎక్స్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్ యాక్సెస్ పొందొచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐఫోన్ యూజర్లకు ఎప్పుడు ఫీచర్‌ను తీసుకొస్తారన్న దానిపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ విషయమై ఎక్స్ ఇంజనీర్ ఎన్రిక్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. ‘ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ‘ఎక్స్’లో ఆడియో, వీడియో కాల్స్ ఫీచర్ అందుబాటులోకి వస్తోంది. యాప్‌ను అప్‌డేట్ చేసి ఫీచర్‌ను వినియోగించుకోండి’ అంటూ రాసుకొచ్చారు.
audio and video calls on X slowly rolling out for android users today! update your app and call your mother
— Enrique 🦖 (@enriquebrgn) January 18, 2024
అయితే ప్రస్తుతం ఎక్స్‌లో ఆడియో, వీడియో కాల్స్ ఫీచర్‌ను ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇతర యూజర్లకు ఈ ఫీచర్‌ను అందిస్తారా.? లేదా అన్న దానిపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇతర మెసేజింగ్ యాప్స్ నుంచి నెలకొన్ని పోటీ నేపథ్యంలో ఎక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..