Winter Solstice 2021: ఈ ఏడాదిలో అతి తక్కువగా ఉండే రోజు డిసెంబర్‌ 21.. కారణం ఏమిటో వెల్లడించిన నాసా శాస్త్రవేత్తలు

Winter Solstice 2021: ఈ ఏడాది డిసెంబర్‌ 21 అంటే ఈ రోజు అత్యంత చిన్నదైన రోజుగా గుర్తించారు నాసా శాస్త్రవేత్తలు. ఉత్తరార్ధగోళంలో ఏర్పడే అయనాంతం కారణంగా..

Winter Solstice 2021: ఈ ఏడాదిలో అతి తక్కువగా ఉండే రోజు డిసెంబర్‌ 21.. కారణం ఏమిటో వెల్లడించిన నాసా శాస్త్రవేత్తలు

Updated on: Dec 21, 2021 | 12:47 PM

Winter Solstice 2021: ఈ ఏడాది డిసెంబర్‌ 21 అంటే ఈ రోజు అత్యంత చిన్నదైన రోజుగా గుర్తించారు నాసా శాస్త్రవేత్తలు. ఉత్తరార్ధగోళంలో ఏర్పడే అయనాంతం కారణంగా ఇది సంభవిస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. మంగళవారం మధ్యాహ్న సమయంలో సూర్యుడు తక్కువ ఎత్తులో ఉంటాడడని, అలా తక్కువ పగటి సమయాన్ని అనుభవిస్తామని నాసా వెల్లడించింది. అయనాంతం టైమ్‌లో సూర్యుడు సంబంధిత అర్ధగోళాలలోని ప్రదేశాలకు దూరంగా ఉంటూ శనిగ్రహంపై ప్రకాశిస్తాడు. ఆ సమయంలో భూమి అక్షాంశంపై 23.5డిగ్రీలు వంగి ఉంటుందని నాసా వెల్లడించింది.

ఈ ఏడాదిలో అత్యంత పొడవైన రాత్రిగా..
ఈ ఏడాదిలో ఈ రోజు అత్యంత పొడవైన రాత్రిగా, అత్యల్ప పగటి రోజుగా గుర్తించింది నాసా. ఉత్తరార్ధగోళంలో డిసెంబర్‌ 21 నుంచి డిసెంబర్‌ 22 వరకూ, దక్షిణార్ధగోళంలో జూన్‌ 20 నుంచి 21కి మధ్య ఇది సంభవిస్తుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Longest Nose: ప్రపంచంలో అత్యంత పొడవైన ముక్కు ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా..? గిన్నిస్‌ బుక్‌లో రికార్డు..!

Year Ender 2021: ఈ ఏడాదిలో ట్విట్టర్‌ తీసుకువచ్చిన టాప్‌-9 ఫీచర్స్‌ ఇవే..!

Oldest Millipede: అరుదైన పురాతన జీవిని కనుగొన్న ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు.. ఆ జీవికి ఎన్ని కాళ్లు ఉన్నాయో తెలిస్తే మతి పోతుంది!