Plane Light: ఫ్లైట్ ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో క్యాబిన్ లైట్లు డిమ్ చేయడానికి కారణం ఏమిటి?
విమానంలో టెక్నాలజీ ఎంతో దాగి ఉంటుంది. విమానాలు గాల్లో ఎగరాలంటే ఎంతో టెక్నాలజీ అవసరం. అయితే చాలా మందికి జీవతంలో ఒక్కసారైనా..
విమానంలో టెక్నాలజీ ఎంతో దాగి ఉంటుంది. విమానాలు గాల్లో ఎగరాలంటే ఎంతో టెక్నాలజీ అవసరం. అయితే చాలా మందికి జీవతంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలనే కోరిక ఉంటుంది. టికెట్ ఖర్చు ఎక్కువగా ఉన్నా.. విమానం ఒక్కాలనేది చాలా మందిలో ఉంటుంది. ఇలాంటి కలలను చాలా మంది నెరవేర్చుకుంటారు. అయితే రాత్రుల్లో విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో విమానం లైట్స్ డిమ్ చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారనే విషయం చాలా మందికి తెలియదు. ఎందుకంటే మన కళ్లు కాంతికి అనుగుణంగా ఇలా చేస్తారు. కళ్లకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు విమానం లైట్లను డిమ్ చేస్తారని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. కాంతి నుంచి చీకటికి లేదా చీకటి నుంచి కాంతికి సర్దుబాటు కావడానికి మన కళ్లు 10 నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది. కానీ కాంతి మసకబారితే కళ్లకు కాంతిని సర్దుబాటు చేసేందుకు తక్కువ సమయం పడుతుంది. అందుకే లైట్ల కాంతిని తగ్గిస్తారు.
మరో కారణం కూడా..
టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో ప్రమాదాలు ఎక్కువగా జరగడం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాము. అందుకే ఎమర్జెన్సీ డోర్లు, ఎగ్జిట్ లైటింగ్ సులువుగా కనిపించేలా ముందుగానే లైట్లను డిమ్ చేస్తారట. 2006, 2017 మధ్య బోయింగ్ ఎయిర్‌లైన్ అనుభవ వివరాల ప్రకారం.. టేకాఫ్ అయిన మొదటి 3 నిమిషాల్లోనే 13 శాతం ప్రమాదాలు జరిగాయి. ల్యాండింగ్‌కు 8 నిమిషాల ముందు 48 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి కారణాల వల్ల లైట్లను డిమ్ చేస్తారని తెలుస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి