Sleeping: కారులో ప్రయాణిస్తున్నప్పుడు నిద్ర ఎందుకు వస్తుంది.. కారణం ఇదే..!
Sleeping: కారులో ప్రయాణం మొదలు పెట్టగానే చాలామందికి నిద్ర (Sleep) రావడం మొదలవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా..? దీనిపై భిన్నమైన..
Sleeping: కారులో ప్రయాణం మొదలు పెట్టగానే చాలామందికి నిద్ర (Sleep) రావడం మొదలవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా..? దీనిపై భిన్నమైన పరిశోధనలు జరిగాయి. పరిశోధనల్లో అనేక విషయాలు వెల్లడయ్యాయి. ఇది జరగడానికి కారులో వేగంగా వెళ్లడం, హైవే హిప్నాసిస్ (Highway Hypnosis), చల్లటి గాలి వంటి అనేక కారణాలు ఉన్నాయి. కదులుతున్న వాహనంలో మాత్రమే నిద్ర వస్తుంది. రాత్రి నిద్రించే సమయంలోలాగే మనసు, శరీరం కూడా రిలాక్స్ అవుతాయి. కదులుతున్న కారులో కదలిక కూడా నిద్రను ప్రేరేపించడానికి పని చేస్తుంది. ఈ పరిస్థితిలో, శరీరం చిన్నతనంలో అదే విధంగా పనిచేస్తుంది, తల్లిదండ్రులు పిల్లలను నిద్రపోయేలా చేయడానికి వారి ఒడిలో బిడ్డను కదిలిస్తుంటారు. అలాంటి సమయంలో పిల్లలు బాగా నిద్రపోతారు. ఇది కూడా అలాగే జరుగుతుంది.
పరిశోనల ప్రకారం.. ఇది ఎక్కువగా డ్రైవర్లలో మాత్రమే జరుగుతుంది. సుదూర ప్రయాణంలో కారు నడుపుతున్నప్పుడు వారు నిద్రపోవడం ప్రారంభిస్తారు. టీ, కాఫీతో వారు ఈ నిద్రను తొలగించడానికి ప్రయత్నిస్తారు. ప్రయాణంలో ఇలా నిద్రపోవడానికి మూడో కారణం ఇంజిన్ శబ్దం, గాలి శబ్దం, వాహనంలో వినిపించే సంగీతం ద్వారా ఉత్పత్తి అయ్యే శబ్దాన్ని వైట్ నాయిస్ అంటారు. అలాంటి శబ్దంలో ఒక వ్యక్తి ఎలా నిద్రపోతాడో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. బాల్యంలో పిల్లవాడిని నిద్రపోయేలా చేస్తున్నప్పుడు, తల్లిదండ్రులు కూడా వివిధ రకాల జోల పాటలు పడుతుంటారు. అలాంటి సమయంలో పిల్లలు నిద్రపోతుంటారని శాస్త్రవేత్తలు అంటున్నారు. దూర ప్రయాణాల్లో నిద్ర రావడం సహజమే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎవరైనా 10-15 నిమిషాల ప్రయాణంలో కూడా నిద్రపోతే, అప్పుడు సోపిట్ సిండ్రోమ్‌తో బాధపడే ప్రమాదం ఉందంటున్నారు.
ఇవి కూడా చదవండి: