WhatsApp iOS Beta Update: ఐఓఎస్ యూజర్ల కోసం ప్రముఖ ఛాటింగ్ యాప్ వాట్సప్ ఓ కొత్త ఫీచర్‌ను తీసుకరాబోతున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ ఎప్పుటికప్పుడు వినియోగదారుల కోసం నూతన ఫీచర్లను అందిస్తోన్న విషయం తెలిసిందే. గతంలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం ప్లాష్ కాల్స్, చాట్ మైగ్రేషన్, చాట్ బ్యాకప్ వంటి కొత్త ఫీచర్లపై పని చేస్తుందని పలు నివేదికలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్టిక్కర్ల కోసం వెతికే శ్రమ లేకుండా త్వరగా శోధించేందుకు ఓ ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు సమాచారం. WABetaInfo నివేదిక మేరకు, ఐఓఎస్ 2.21.120.9 అనే బీటా అప్‌డేట్‌తో ఈ సరికొత్త ఫీచర్‌ను అందిచనుందని తెలుస్తోంది. ఈ ఫీచర్ స్టిక్కర్లను త్వరగా వెతికేందుకు ఉపయోగపడుతుంది. చాట్‌బార్‌లో టైప్ చేసిన పదాన్ని విశ్లేషించి, యూజర్ యొక్క స్టిక్కర్ లైబ్రరీలో సేవ్ చేసిన స్టిక్కర్‌లతో సరిపోల్చేందుకు ప్రయత్నిస్తుంది. చాట్ బార్‌లో కీవర్డ్‌కు సంబంధించిన అన్ని స్టిక్కర్లను ప్రదర్శిస్తుంది. అయితే ఈ ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. జూన్‌లోనే v2.21.12.1 అప్‌డేట్‌తో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఐఓఎస్ యూజర్ల కోసం పరీక్షిస్తున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. అయితే ఇది ప్రస్తుతం బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
చాట్ బార్‌లో టైప్ చేసిన మొదటి పదాన్ని ఈ ఫీచర్ విశ్లేషిస్తుంది. ఆ స్టిక్కర్ యూజర్ స్టిక్కర్ లైబ్రరీలో యూజర్‌కు సూచిస్తుంది. అలాగే చాట్ బార్‌లోని ఎమోజీ బటన్‌ను ప్రెస్ చేస్తే.. ఆ కీవర్డ్‌కి సంబంధించిన స్టిక్కర్‌లను కూడా చూపిస్తుంది.
ప్రస్తుతానికి వాట్సాప్ నూతన ఫీచర్ థర్డ్ పార్టీ స్టిక్కర్లను అనుమతించదని బ్లాగ్ పేర్కొంది. అయితే యూజర్ సృష్టించిన స్టిక్కర్ ప్యాక్‌లను మాత్రం సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది.
అంతేకాకుండా, క్రాస్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ తన ఆండ్రాయిడ్ బీటా యూజర్ల కోసం గ్రీన్ కలర్ నోటిఫికేషన్‌ను మరలా తీసుకొచ్చిందని వాట్సాప్ ట్రాకర్ పేర్కొంది. ఆండ్రాయిడ్ కోసం 2.21.12.12 బీటా అప్‌డేట్ ద్వారా ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోందని పేర్కొంది. బీటా యూజర్ల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ ఫీచర్‌ను మరలా తీసుకొస్తుందని తెలుస్తోంది.
Also Read: