Whatsapp Working: ఆ ఫోన్స్‌లో వాట్సాప్ సేవలు బంద్.. మీ ఫోన్ ఉందో చెక్ చేసుకోండి..!

పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో అన్ని ఫోన్లకు వాట్సాప్ తన పరిధిని విస్తరిస్తుంది. కానీ మార్కెట్‌లో అనేక రకాల కొత్త సాఫ్ట్ వేర్స్‌తో మొబైల్స్ అందుబాటులోకి రావడంతో పాత హ్యాండ్‌సెట్స్‌కు సేవలను అందించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా వాట్సాప్ దాదాపు ప్రముఖ కంపెనీలకు చెందిన 35 ఫోన్స్‌కు వాట్సాప్‌ను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.

Whatsapp Working: ఆ ఫోన్స్‌లో వాట్సాప్ సేవలు బంద్.. మీ ఫోన్ ఉందో చెక్ చేసుకోండి..!
Whatsapp
Follow us

|

Updated on: Jun 27, 2024 | 4:10 PM

ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ ఒకటి. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌తో అప్‌డేట్ చేస్తుంది. అయితే పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో అన్ని ఫోన్లకు వాట్సాప్ తన పరిధిని విస్తరిస్తుంది. కానీ మార్కెట్‌లో అనేక రకాల కొత్త సాఫ్ట్ వేర్స్‌తో మొబైల్స్ అందుబాటులోకి రావడంతో పాత హ్యాండ్‌సెట్స్‌కు సేవలను అందించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా వాట్సాప్ దాదాపు ప్రముఖ కంపెనీలకు చెందిన 35 ఫోన్స్‌కు వాట్సాప్‌ను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మెటా తాజా నిర్ణయం మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

పలు నివేదికల ప్రకారం గూగుల్, యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల పాత వెర్షన్‌లను కలిగి ఉన్న మొత్తం 35 మొబైల్ ఫోన్‌లలో వాట్సాప్ అప్‌డేట్స్‌ను నిలిపేస్తున్నట్లు వెల్లడించాయి. సామ్‌సంగ్, మోటోరోలా, హువాయ్, సోనీ, ఎల్‌జీ, యాపిల్‌కు సంబంధించిన ఫోన్స్‌కు అప్‌డేట్స్‌ను వాట్సాప్ నిలిపేసింది. వాట్సాప్ విడుదల చేసిన జాబితాలోని కొన్ని పరికరాలు పాతవి కానీ మంచి హార్డ్‌వేర్ లేదా అప్‌గ్రేడ్ చేయడంలో అసమర్థత కారణంగా కొంతమంది వినియోగదారులు ఇప్పటికీ వాటి ద్వారా మెసేజింగ్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం మీరు ఆండ్రాయిడ్ 5.0 (లేదా తర్వాత) లేదా ఐఎస్ 12 (లేదా తర్వాత) ఉన్న ఐఫోన్‌ని కలిగి ఉంటే మాత్రమే యాప్‌ను ఉపయోగించమని వాట్సాప్ సిఫార్సు చేస్తోంది.

అప్‌డేట్స్ నిలిపేసిన ఫోన్స్ ఇవే

సామ్‌సంగ్ 

గెలాక్సీ ఏస్ ప్లస్, గెలాక్సీ కోర్, గెలాక్సీ ఎక్స్‌ప్రెస్ 2, గెలాక్సీ గ్రాండ్, గెలాక్సీ నోట్-3, గెలాక్సీ ఎస్ 19500, గెలాక్సీ  ఎస్3 మినీ వీఈ, గెలాక్సీ ఎస్4 యాక్టివ్, గెలాక్సీ ఎస్ 4 మినీ I9190, గెలాక్సీ ఎస్ 4 మినీ I9192 డ్యూయోస్, గెలాక్సీ ఎస్-4 మినీ I9195 ఎల్‌టీఈ, గెలాక్సీ ఎస్ 4 జూమ్

ఇవి కూడా చదవండి

మోటరోలా

మోటో జీ, మోటో ఎక్స్

ఆపిల్

ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ, ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్ ప్లస్, ఐఫోన్ 6 ఎస్, ఐఫోన్ ఎస్ఈ

హువాయ్

అసెండ్ పీ 6 ఎస్, అసెండ్ జీ525, హువాయ్ సీ 199, హువాయ్ జీఎక్స్1 ఎస్, హువాయ్ వై 625

లెనోవా

లెనోవా 46600, లెనోవో ఏ858టీ, లెనోవో పీ 70 , లెనోవో ఎస్ 890, 

సోనీ

ఎక్స్‌పిరియా జెడ్1, ఎక్స్‌పీరియా ఈ3

ఎల్‌జీ

ఆప్టిమస్ 4ఎక్స్ హెచ్‌డీ, ఆప్టిమస్ జి, ఆప్టిమస్ జీ ప్రో, ఆప్టిమస్ ఎస్ 7

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Latest Articles
Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి ఆ రాశుల వారికి విముక్తి..
Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి ఆ రాశుల వారికి విముక్తి..
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు