ఐఫోన్ 15పై బంపర్ ఆఫర్.. కొత్త ఫీచర్లు ఇవే!

TV9 Telugu

24 June 2024

తాజాగా iPhone 15తో అందుబాటులో ఉన్న ఓ ప్రత్యేక డీల్ తీసువచ్చింది దిగ్గజ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్.

iPhone 15 Apple తాజా సిరీస్‌లో భాగం. గత ఏడాది సెప్టెంబర్‌లో కంపెనీ దీన్ని ప్రారంభించింది. ఈ సిరీస్ ప్రారంభ ఫోన్.

ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో దీని ధర రూ. 63,999 కాగా, దీని అసలు ధర రూ. 79,990. అన్ని ఆఫర్లతో కూడిన ఈ హ్యాండ్ సెట్ లో రూ.14 వేల వరకు ఆదా చేసుకునే అవకాశం.

ఈ తగ్గింపు iPhone 15 128Gb వేరియంట్‌పై అందుబాటులో ఉంది. ఇందులో 6.1 ఇంచ్ డిస్‌ప్లే ఉంది. దీనికి సిరామిక్ షీల్డ్ గ్లాస్ రక్షణ ఉంది.

Apple A16 Bionic (4 nm) చిప్‌సెట్ iPhone 15లో ఉపయోగించారు. ఇది Apple GPU (5-కోర్ గ్రాఫిక్స్)తో వస్తుంది.

ఐఫోన్ 15లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వడం జరిగింది. ఇందులోని ప్రైమరీ కెమెరా 48MP, సెకండరీ కెమెరా 12MP. 12MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

iPhone 15 Li-Ion 3349 mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీని కలిగి ఉంది. కేవలం 30 నిమిషాల్లో 50% ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. వైర్‌లెస్ ఛార్జర్ సపోర్ట్ కూడా ఉంది.

ఫ్లిప్‌కార్ట్ లో ఈ సేల్ జూన్ 27 వరకు కొనసాగుతుంది. ఈ ధరలో ఐఫోన్ 15 ఎంతకాలం జాబితాలో ఉంచుతుందనే దాని గురించి ఇంకా సమాచారం లేదు.

ఐఫోన్ 15 నాలుగు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. ఇది ప్రారంభ 128Gb వెర్షన్‌. అయితే టాప్ 512Gb. మైక్రో SD కార్డ్ ఏ వేరియంట్‌లోనూ ఇన్‌స్టాల్ చేయడం కుదరదు.