బంగాళాదుంపను అంతరిక్షంలో వదిలిపెట్టింది ఎవరు?
TV9 Telugu
26 June 2024
బంగాళాదుంప ఆకారంలో మార్స్ దగ్గర మరో చంద్రుడి పోలిన ఉప గ్రహాం ఉన్నట్లు, దాని పేరు ఫోబోస్ అని NASA పేర్కొంది.
'స్పేస్ పొటాటో' అనే క్యాప్షన్‌తో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అంతరిక్షం ఫోటోను పోస్ట్ చేసింది.
ఈ ఫోటో మార్స్ ఫోబోస్‌కు సంబంధించినది పేర్కొంది. ఫోబోస్ మార్స్‌కు మరో చంద్రుడు.. అంగారకుడికి ఫోబోస్ , డీమోస్ రెండు చంద్రులు ఉన్నాయి.
ఫోబోస్ డీమోస్ కంటే కొంచెం పెద్దది. దాని ఆకారం, రంగు కారణంగా, నాసా దీనిని క్యాప్షన్‌లో స్పేస్ పొటాటోగా అభివర్ణించింది.
ఇది భూమి - చంద్రుని వలె గుండ్రంగా ఉండదని వివరించింది. నాసా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రకారం, ఫోబోస్ పొడవు 27 కిమీ, ఎత్తు 18 కిమీ, వెడల్పు 22 కిమీ.
NASA ప్రకారం, ఫోబోస్ రంగు ఎరుపు-గోధుమ రంగులో ఉంటుంది. ఉపరితలంపై గుంటలు ఉన్నాయి. ఆకారం కూడా వంకరగా ఉంటుంది.
ఫోబోస్ చాలా చిన్నది. గురుత్వాకర్షణ శక్తి కూడా తక్కువగా ఉంటుంది. అందుకే ఇది భూమి -చంద్రుడిలా గుండ్రంగా ఉండదని నాసా చెబుతోంది.
ఫోబోస్ ప్రతి 100 ఏళ్లలకు 6 అడుగుల మేర అంగారకునికి చేరువవుతూ 50 మిలియన్ల ఏళ్లలో ఢీకొనడంతో ఇది విచ్ఛిన్నమవుతుంది లేదా రింగ్‌గా చీలిపోతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి