Sim Card: జూల్‌1 నుంచి మారనున్న సిమ్‌ కార్డ్‌ రూల్స్.. ఇకపై ఆ ఆటలు సాగవు

వినయోగదారుల భద్రతను పెంచుతూ జూల్‌ 1వ తేదీ నుంచి సిమ్‌ కార్డులకు సంబంధించి నియమాలను మార్చనున్నారు. ఇందులో భాగంగానే మొబైల్ నంబర్ పోర్టబిలిటీకి సంబంధించి నిబంధనను మార్చాలని నిర్ణయించారు. సిమ్ స్వాప్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాయ్‌ తెలిపింది. కొత్తగా తీసుకొస్తున్న ఈ నిబంధనల ప్రకారం..

Sim Card: జూల్‌1 నుంచి మారనున్న సిమ్‌ కార్డ్‌ రూల్స్.. ఇకపై ఆ ఆటలు సాగవు
Sim Card
Follow us

|

Updated on: Jun 27, 2024 | 3:26 PM

మారిన టెక్నాలజీతో పాటు నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా సైబర్‌ మోసాలు మాత్రం తగ్గడం లేదు. ఇలాంటి మోసాల్లో సిమ్‌ కార్డులకు సంబంధించినవి కూడా ఉన్నాయి. సిమ్‌ స్వాప్‌ పేరుతో ఇటీవల మోసాలు ఎక్కువుతున్నాయి. మన ప్రమేయం లేకుండానే మన పేరు మీద ఇంకొకరు సిమ్‌ కార్డును తీసుకోవడమే సిమ్‌ స్వాపింగ్. అయితే ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయడాకి టెలికం సంస్థ ట్రాయ్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

వినయోగదారుల భద్రతను పెంచుతూ జూల్‌ 1వ తేదీ నుంచి సిమ్‌ కార్డులకు సంబంధించి నియమాలను మార్చనున్నారు. ఇందులో భాగంగానే మొబైల్ నంబర్ పోర్టబిలిటీకి సంబంధించి నిబంధనను మార్చాలని నిర్ణయించారు. సిమ్ స్వాప్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాయ్‌ తెలిపింది. కొత్తగా తీసుకొస్తున్న ఈ నిబంధనల ప్రకారం.. ఒకవేళ మీరు సిమ్‌కార్డును కోల్పోయినా, పాడైపోయినా వెంటనే సిమ్‌ తీసుకోవడానికి వీలుపడదు.

ప్రస్తుతం సిమ్‌ కార్డ్‌ కోల్పోతే వెంటనే స్టోర్ నుంచి కొత్త సిమ్‌ తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు కొత్త సిమ్‌ కార్డ్‌ను తీసుకోవడానికి కనీసం 7 రోజులు పాటు వేచి చూడాల్సిందే. ఏడు రోజుల లాకింగ్ వ్యవధి అమలు చేయనున్నారు. ఒక సిమ్‌ కార్డు కోల్పోతే అదే నెంబర్‌తో మరో సిమ్ కార్డ్‌ యాక్టివేట్ చేసుకోవాలంటే కొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.

దీంతో ఒకవేళ మన ప్రమేయం లేకుండా మన సిమ్‌ కార్డును ఎవరైనా స్విమ్‌ స్వాపింగ్ చేస్తే తెలిసిపోతుంది. మీ ప్రమేయం లేకుండా ఏడు రోజుల పాటు సిమ్‌ డీ యాక్టివేట్‌లో ఉంటే, కచ్చితంగా మీ సిమ్‌ కార్డు విషయంలో అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది. దీంతో నేరాలు తగ్గుతాయి. ఇదిలా ఉంటే సిమ్ స్వాపింగ్ ద్వారా నేరస్థులు మీ నెంబర్ పై కొత్త సిమ్ ను యాక్టివేట్ చేసుకుంటారు. దీంతో మీ ఓటీపీలను సులభంగా యాక్సెస్ చేసి మీ ఖాతాల్లోని డబ్బును సులభంగా కాజేస్తున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Latest Articles
Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి ఆ రాశుల వారికి విముక్తి..
Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి ఆ రాశుల వారికి విముక్తి..
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు