
WhatsApp Privacy Settings: వాట్సాప్ వినియోగదారుల గోప్యతను మెరుగుపరచడానికి యాప్‌లో అనేక ఫీచర్లను అందిస్తుంది. ఇటీవల, కంపెనీ ‘WhatsApp Chat‘ అప్‌డేట్‌ను కూడా ప్రారంభించింది. దీనిలో కంపెనీ గోప్యతకు సంబంధించిన ఫీచర్ల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలోనే మీరు మీ మొబైల్ ఫోన్‌లో వెంటనే ఆన్ చేయవలసిన వాట్సాప్ 4 సెట్టింగ్‌ల గురించి తెలుసుకుందాం..
ఈ సెట్టింగ్‌లు చాలా ఉపయోగకరం..
2FA: మీ వాట్సాప్ అకౌంట్ సురక్షితంగా ఉండటానికి 2FA ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని ఆన్‌లో ఉంచడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే.. మీరు మీ అకౌంట్‌ను మరొక డివైజ్‌లో ఓపెన్ చేసినప్పుడు లేదా నిర్దిష్ట సమయం తర్వాత దాన్ని తెరిచినప్పుడు, WhatsApp మీరు సెట్ చేసిన 6 అంకెల పిన్‌ను అడుగుతుంది. అలాంటి పరిస్థితిలో, మరెవరూ మీ ఖాతాను తెరవలేరు.
యాప్ లాక్ : WhatsApp మీ చాట్‌లను రక్షించడానికి యాప్ లాక్, చాట్ లాక్‌ని అందిస్తుంది. రెండింటినీ ఆన్‌లో ఉంచడం ద్వారా, మీ ఖాతా మరింత సురక్షితం అవుతుంది. బయటి వ్యక్తి మీ చాట్‌లు లేదా డేటాను తెరవలేరు.
WhatsApp సెట్టింగ్స్‌లోకి వెళ్లాక ప్రైవసీ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేశాక.. ప్రైవసీకి సంబంధించిన ఇతర ఆప్షన్స్ ఉంటాయి. అందులో చాలా రకాల ఆప్షన్ ఉంటాయి. వాటిలో గ్రూప్‌లో ఎవరు మిమ్మల్ని యాడ్ చేయొద్దు. ఎవరు యాడ్ చేయొచ్చు వంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. అలాగే, మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరు చూడొచ్చు, ఎవరు చూడకూడదు. మెసేజ్ టైమర్ ప్రైవసీ వంటి ఫీచర్స్ ఉంటాయి. వాటిని ఆన్‌లో ఉంచుకోవచ్చు.
త్వరలో వాట్సాప్ యాప్‌కి ‘ఇమెయిల్ వెరిఫికేషన్’ ఫీచర్‌ను కూడా యాడ్ చేయబోతుంది మేటా యాజమాన్యం. ఆ తరువాత మొబైల్ నంబర్‌తో పాటు, ఇమెయిల్ ద్వారా కూడా మీ అకౌంట్‌ను ఓపెన్ చేయడానికి ఆస్కారం లభిస్తుంది. అయితే, ఇందుకోసం మీరు ముందుగా మీ ఇమెయిల్‌ను WhatsAppకి లింక్ చేయాల్సి ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..