Whats app: వాట్సాప్‌ యూజర్లకు బంపరాఫర్‌.. ఇలా చేస్తే క్యాష్‌ బ్యాక్‌ పొందే అవకాశం..

|

Jun 11, 2022 | 7:57 AM

Whats app: భారత్‌లో డిజిటల్‌ లావాదేవీలు (Digital Transactions) రోజురోజుకీ పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా యూపీఐ పేమెంట్స్‌కు పెద్ద పీట వేస్తుండడంతో కొత్త కొత్త యాప్‌లు అందుబాటులోకి వస్తున్నాయి...

Whats app: వాట్సాప్‌ యూజర్లకు బంపరాఫర్‌.. ఇలా చేస్తే క్యాష్‌ బ్యాక్‌ పొందే అవకాశం..
Follow us on

Whats app: భారత్‌లో డిజిటల్‌ లావాదేవీలు (Digital Transactions) రోజురోజుకీ పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా యూపీఐ పేమెంట్స్‌కు పెద్ద పీట వేస్తుండడంతో కొత్త కొత్త యాప్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో ఈ రంగంలోనూ భారీగా పోటీ ఏర్పడింది. ఈ కారణంగానే యూజర్లను తమవైపు ఆకట్టుకునేందుకు గాను డిజిటల్‌ పేమెంట్‌ యాప్స్‌ రకరకాల ఆఫర్లను అందిస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ ఇలాంటి ఓ బంపరాఫర్‌ను ప్రకటించింది. వాట్సాప్‌ యూపీఐ పేమెంట్స్‌ను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే వాట్సాప్‌ పేమెంట్‌కు యూజర్లను ఆకర్షించేందుకు గాను క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఎంపిక చేసిన కొందరు యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్‌ను అందిస్తోంది వాట్సాప్‌.

వాట్సాప్‌ పేమెంట్ ఫీచర్‌ ద్వారా ఇతరులకు పేమెంట్‌ చేస్తే మొదటి మూడు లావాదేవీలకు రూ. 35 చొప్పున, రూ. 105 డబ్బును క్యాష్‌బ్యాక్‌ రూపంలో అందిస్తోంది. రూపాయి నుంచి మొదలు ఎంత పేమెంట్‌ చేసినా వాట్సాప్‌ రూ. 35 క్యాష్‌ బ్యాక్‌ ఇస్తోంది. డిజిటల్‌ చెల్లింపుల కోసం ఎక్కువ మంది వాట్సాప్‌ పేమెంట్‌ ఉపయోగించేలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్లు వాట్సాప్‌ తెలిపింది. పరిమిత కాల ఆఫర్‌ను కేవలం ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే వర్తిస్తుందని వాట్సాప్‌ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఇందుకోసం యూజర్లు వాట్సాప్‌లో యూపీఐ పేమెంట్స్‌ను యాక్టివేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్‌ పేమెంట్ సెక్షన్‌లోకి వెళ్లి బ్యాంక్‌ వివరాలను నమోదు చేసుకోవాలి. అనంతరం మీరు డబ్బులు పంపాలనుకుంటన్న యూజర్ కాంటాక్ట్‌ను ఓపెన్‌ చేసి. కింద కనిపించే ‘రూపీ’ సింబల్‌ను క్లిక్‌ చేసి.. అమౌంట్‌ను ఎంటర్‌ చేసి యూపీఐ పిన్‌ నమోదు చేస్తే వెంటనే డబ్బులు సదరు వ్యక్తి ఖాతాలోకి వెళ్లిపోతాయి. కొద్దిసేపటికే మీ ఖాతాల్లోకి రూ. 35 క్యాష్‌బ్యాక్‌ రూపంలో వస్తాయి. ఇలా మూడు సార్లు క్యాష్‌బ్యాక్‌ పొందే అవకాశం ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..