Whats App Update: నెంబర్‌ కనబడకుండా వాట్సాప్‌ మేసేజ్‌.. సరికొత్త భద్రతా ఫీచర్‌ ప్రవేశపెట్టిన వాట్సాప్‌

|

Jul 13, 2023 | 4:01 PM

తాజాగా వాట్సాప్‌ తన ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌  వినియోగదారుల కోసం ఫోన్ నంబర్ గోప్యత అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేస్తుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ అప్‌డేట్‌ బీటా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. తాజా బీటా అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత వినియోగదారులు కమ్యూనిటీ అనౌన్స్‌మెంట్ గ్రూప్ సమాచారంలో 'ఫోన్ నంబర్ గోప్యత' అనే కొత్త ఎంపికను కనుగొంటారు.

Whats App Update: నెంబర్‌ కనబడకుండా వాట్సాప్‌ మేసేజ్‌.. సరికొత్త భద్రతా ఫీచర్‌ ప్రవేశపెట్టిన వాట్సాప్‌
Whatsapp
Follow us on

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా యువత స్మార్ట్‌ఫోన్‌లోని వివిధ యాప్స్‌ను ఇష్టపడుతున్నారు.  స్మార్ట్‌ఫోన్‌లో వచ్చే వాట్సాప్‌ను ఎక్కువ మంది వాడుతున్నారు. గ్రూప్స్‌ ఫీచర్‌తో పాటు ఆడియో, వీడియో కాల్స్‌ చేసుకునే సదుపాయం ఉండడంతో ఎక్కువ మంది వాట్సాప్‌ను వాడుతున్నారు. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా వాట్సాప్‌ కూడా వివిధ అప్‌డేట్స్‌ను అందిస్తుంది. ముఖ్యంగా వినియోగదారుల భద్రతకు అనుగుణంగా వివిధ చర్యలు తీసుకుంటుంది. తాజాగా వాట్సాప్‌ తన ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌  వినియోగదారుల కోసం ఫోన్ నంబర్ గోప్యత అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేస్తుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ అప్‌డేట్‌ బీటా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. తాజా బీటా అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత వినియోగదారులు కమ్యూనిటీ అనౌన్స్‌మెంట్ గ్రూప్ సమాచారంలో ‘ఫోన్ నంబర్ గోప్యత’ అనే కొత్త ఎంపికను కనుగొంటారు. ఈ తాజా అప్‌డేట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఓ సారి తెలుసుకుందాం.

వాట్సాప్‌ కమ్యూనిటీలో వారి ఫోన్ నంబర్‌లను దాచడం ద్వారా వారి గోప్యతను నిర్వహించడానికి ఈ ఫీచర్ సహాయపడుతుంది. ఈ ఫీచర్‌తో వారి ఫోన్ నంబర్ కమ్యూనిటీ అడ్మిన్‌లకు వారిని కాంటాక్ట్‌గా సేవ్ చేసుకున్న ఇతర వ్యక్తులకు మాత్రమే కనిపిస్తుంది. సంభాషణలో పాల్గొనే ఇతర వ్యక్తుల నుండి వారి పూర్తి ఫోన్ నంబర్‌లను దాచడానికి కూడా ఇది వినియోగదారులకు సహాయపడుతుంది. అయితే, ఫీచర్ కేవలం కమ్యూనిటీ సభ్యులకు మాత్రమే పరిమితం చేశారు. అలాగే కమ్యూనిటీ అడ్మిన్ ఫోన్ నంబర్ ఎల్లప్పుడూ కనిపిస్తుంది. అయితే ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ బీటా వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈ అప్‌డేట్‌ భవిష్యత్‌లో సాధారణ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వస్తుందని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

గ్రూప్‌ సజెషన్స్‌ ఫీచర్‌ కూడా

వాట్సాప్‌ గత వారం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో సపోర్ట్‌ చేసేలా కమ్యూనిటీల కోసం కొత్త గ్రూప్ సజెషన్స్ ఫీచర్‌పై పని చేస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. వాట్సాప​ కమ్యూనిటీ నిర్వాహకులు ఈ విభాగాన్ని ఉపయోగించి ఇతర సంఘం సభ్యులు చేసిన ఏదైనా అభ్యర్థనను ఆమోదించగలరు లేదా తిరస్కరించగలరు. ముఖ్యంగా సూచనలను త్వరగా ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి ఈ విభాగం రెండు షార్ట్‌కట్‌లను కలిగి ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..