WhatsApp: వాట్సాప్‌ నుంచి కొత్త ఫీచర్‌.. హ్యాపీయర్ దెన్ యానిమేటెడ్ స్టిక్కర్స్.. ఎలా డౌన్‌లోడ్‌ చేయాలంటే

|

Aug 03, 2021 | 8:26 AM

WhatsApp Sticker: ఫేస్‌బుక్‌ యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ కొత్త కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తూ యూజర్లను మరింతగా ఆకట్టుకుంటోంది..

WhatsApp: వాట్సాప్‌ నుంచి కొత్త ఫీచర్‌.. హ్యాపీయర్ దెన్ యానిమేటెడ్ స్టిక్కర్స్.. ఎలా డౌన్‌లోడ్‌ చేయాలంటే
Whatsapp
Follow us on

WhatsApp Sticker: ఫేస్‌బుక్‌ యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ కొత్త కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తూ యూజర్లను మరింతగా ఆకట్టుకుంటోంది. వాట్సాప్ ఇటీవల​ తీసుకొచ్చిన నూతన ప్రైవసీ పాలసీ ద్వారా యూజర్లు చేజారిపోకుండా ఉండేందుకు వరుసగా కొత్త ఫీచర్లను విడుదల చేస్తుంది. ఇందులో భాగంగా ఇటీవల ఫ్లాష్​ కాల్, ఎన్​క్రిప్టెడ్​ ఛాట్​ బ్యాకప్​, ఛాట్​ మైగ్రేషన్​, డిజప్పియరింగ్​ మెసేజెస్​, గ్రూప్​ వీడియో కాలింగ్​ వంటి ఫీచర్లను జోడించింది. వీటిని ఆండ్రాయిడ్​తో పాటు ఐఓఎస్​ యూజర్లకు సైతం అందుబాటులోకి తెచ్చింది. ఇదే సమయంలో వాట్సాప్​ తాజాగా కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ‘బిల్లీ ఎలిష్’ యానిమేటెడ్​ స్టిక్కర్​ప్యాక్‌ను ఆవిష్కరించింది. ఈ ఫీచర్​ కింద ‘హ్యాపీయర్ దెన్ ఎవర్’ అనే హాలీవుడ్ చిత్రంలోని సన్నివేశాలతో కూడిన స్టిక్కర్లను చిన్న వీడియో స్నిప్పెట్‌ల రూపంలో అందిస్తుంది. ఇవి యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్ రూపంలో ఉంటాయి.

స్టిక్కర్ ప్యాక్‌ ఎక్కడ ఉంటాయి ?

ఈ స్టిక్కర్ ప్యాక్‌లో 15 సెకన్ల నిడివి గల Gif​లను చేర్చింది వాట్సాప్ సంస్థ. అయితే సంస్థ కొత్తగా ప్రవేశపెట్టిన ‘హ్యాపీయర్ దెన్ యానిమేటెడ్’ స్టిక్కర్ ప్యాక్‌ను సాధారణ స్టిక్కర్ ప్యాక్‌ల వలే డౌన్‌లోడ్ చేయలేము. కేవలం ప్రత్యేక లింక్ ద్వారానే ఈ స్టిక్కర్​ప్యాక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. కేవలం 1.2MB స్పేస్ ఉంటే సరిపోతుంది. మరీ ఈ స్టిక్కర్‌ ప్యాక్‌ను ఎలా డౌన్‌లోడ్‌ చేయాలంటే..

ముందుగా wa.me/stickerpack/Ha  అనే లింక్​పై క్లిక్​ చేయండి. తర్వాత ఓపెన్ యాప్ ఆప్షన్‌​లోకి వెళ్లండి. ఆ తర్వాత డౌన్‌లోడ్ బటన్‌పై క్లిక్​ చేయండి. ఆ తరువాత మీ ఫోన్​లోకి ‘హ్యాపీయర్​దెన్​ యానిమేటెడ్’​ స్టిక్కర్ ప్యాక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీటి డౌన్​లోడ్​ పూర్తయిన తర్వాత, మీ అన్ని ఇతర స్టిక్కర్ ప్యాక్‌లతో పాటు ఈ కొత్త స్టిక్కర్​ ప్యాక్‌లు వాట్సాప్​లో కనిపిస్తాయి. వీటిని ఎవరికైనా సులభంగా సెండ్ చేసుకోవచ్చు.

 

ఇవీ కూడా చదవండి

Apple Users Alert: యూపిల్‌ యూజర్లకు అలర్ట్‌.. వీటిని వెంటనే అప్‌డేట్‌ చేసుకోండి.. ఇకపోతే ఇబ్బందులే..!

Redmi 9c: రూ.9వేలలోపే రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌.. 128జీబీ స్టోరేజీ.. అద్భుతమైన ఫీచర్స్‌