వాట్సాప్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. వాట్సాప్ లేనిది ఏ స్మార్ట్‌ఫోన్ అంటూ ఉండదు. ఈ మధ్య కాలంలో చిన్న ఫోన్‌లలో కూడా వాట్సాప్ పని చేస్తుంది. వాట్సాప్‌లో కొత్త కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది కంపెనీ. యూజర్లను దృష్టిలో ఉంచుకుని కొత్త కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ మెసేజింగ్ యాప్ త్వరలో మీ వాయిస్ నోట్‌ని స్టేటస్ అప్‌డేట్‌గా షేర్ చేసే అవకాశాన్ని తీసుకొస్తోంది. ప్రస్తుతం, వాట్సాప్ యూజర్లు స్టేటస్ అప్‌డేట్‌ల మాదిరిగానే ఫొటోలు, వీడియోలను మాత్రమే షేర్ చేయవచ్చు. వాట్సాప్ యాప్ iOS బీటా వెర్షన్‌లో ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తున్నట్టు గుర్తించారు.
Wabetainfo ప్రకారం..వాట్సాప్ మీ స్టేటస్ అప్‌డేట్‌కు వాయిస్ నోట్‌ను షేర్ చేసే సామర్థ్యంపై పని చేస్తోంది. ఆండ్రాయిడ్ కోసం వాట్సాప్ బీటాలో ఫీచర్ అందుబాటులో లేదు. బీటా కోసం iOSలో ఫీచర్‌ను టెస్టింగ్ చేయడం ద్వారా లాంచ్ చేసింది. వాట్సాప్ యూజర్లు మీ స్టేటస్ అప్‌డేట్‌లకు టెక్స్ట్‌తో 30 సెకన్ల వరకు వాయిస్ నోట్‌ను పోస్ట్ చేయగలరని నివేదిక వెల్లడించింది. మీరు మీ టెక్ట్స్ టైప్ చేసే దగ్గర కనిపించే మైక్రోఫోన్ ఐకాన్‌పై Tap చేయవచ్చు.
WhatsApp is working on voice status updates on iOS beta!
It will be possible to share a voice note up to 30 seconds via status in a future update of WhatsApp beta for iOS!https://t.co/oJCapYIVl1
— WABetaInfo (@WABetaInfo) November 25, 2022
ఇంకో విషయం ఏంటంటే మీరు ఎంచుకున్న యూజర్లకు మాత్రమే మీ వాయిస్ స్టేటస్ అప్‌డేట్‌లు షేర్ అవుతాయి. ఎల్లప్పుడూ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేసేందుకు వాట్సాప్ బీటా నివేదించింది. మీ స్టేటస్ అప్‌డేట్‌లకు 30 సెకన్ల వరకు వాయిస్ నోట్‌ను పోస్ట్ చేయవచ్చు. వాట్సాప్ కాల్స్ ట్యాబ్ణు యాప్ డెస్క్‌టాప్ వెర్షన్‌కు తీసుకువచ్చేందుకు కూడా కృషి చేస్తోంది. వినియోదారులు ఇప్పుడు డెస్క్‌టాప్ యాప్ నుంచి నేరుగా కాల్ చేసే సదుపాయం ఉంటుంది. ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి