ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ వరాలు ఎన్నో…

|

Oct 17, 2019 | 12:26 PM

యూజర్ల కోసం ప్రతి అప్డేట్‌కి ఏదో ఒక కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తున్న వాట్సాప్.. తాజాగా ఐఫోన్ వినియోగదారులకు బూమరాంగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగానే ఇప్పటి నుంచి ఐఫోన్ యూజర్లు బూమరాంగ్స్‌ను డైరెక్ట్‌గా వాట్సాప్‌లో క్రియేట్ చేసుకోవచ్చు. ఫోటో ఎడిట్స్, వాయిస్ రికార్డింగ్స్.. ఇలా మరెన్నో సరికొత్త ఫీచర్లను కూడా వారి కోసం వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. డెవలపర్ల కోసం రూపొందించిన వాట్సాప్ బీటా వెర్షన్ 2.19.100 ద్వారా ఇవి మొదటగా బీటా యూజర్లకు అందుబాటులోకి […]

ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ వరాలు ఎన్నో...
Follow us on

యూజర్ల కోసం ప్రతి అప్డేట్‌కి ఏదో ఒక కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తున్న వాట్సాప్.. తాజాగా ఐఫోన్ వినియోగదారులకు బూమరాంగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగానే ఇప్పటి నుంచి ఐఫోన్ యూజర్లు బూమరాంగ్స్‌ను డైరెక్ట్‌గా వాట్సాప్‌లో క్రియేట్ చేసుకోవచ్చు. ఫోటో ఎడిట్స్, వాయిస్ రికార్డింగ్స్.. ఇలా మరెన్నో సరికొత్త ఫీచర్లను కూడా వారి కోసం వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. డెవలపర్ల కోసం రూపొందించిన వాట్సాప్ బీటా వెర్షన్ 2.19.100 ద్వారా ఇవి మొదటగా బీటా యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత కొద్దికాలానికే సాధారణ వినియోగదారులకు కూడా ఇవి అందుబాటులోకి వస్తాయి.

ఇప్పటికే చాటింగ్స్‌లో వీడియోలు, ఫోటోలను పంపడానికి వాట్సాప్‌లో ఇన్-బిల్ట్‌గా ఎడిట్ టూల్ ఒకటి ఉండగా.. అది కాకుండా మరో కొత్త టూల్‌ను కూడా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఈ టూల్ ద్వారా యూజర్లు డూడుల్ ఐకాన్‌ను ఫోటో లేదా వీడియో కింద చూసే అవకాశం ఉందని సమాచారం. ఈ సరికొత్త ఫీచర్ వల్ల వినియోగదారులు ఫోటోలను పంపించక ముందే ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వన్ నిఫ్టీ ఫీచర్‌తో వాయిస్ మెసేజ్‌స్‌ను యూజర్లు వాట్సాప్ ఓపెన్ చేయకుండా వినొచ్చు. దీని కోసం వాళ్ళు వాట్సాప్ నోటిఫికేషన్‌ను లాంగ్ ప్రెస్ చేస్తే చాలు. మరోవైపు ఐఫోన్ వినియోగదారులు మెమోజీ అనే సరికొత్త ఫీచర్ ద్వారా స్టికర్స్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.