WhatsApp: వాట్సాప్‌లో యాడ్స్ వస్తాయా? నిజమేనా? ఆదాయం కోసం కొత్త మార్గాలు వెతుకున్నారా? పూర్తి వివరాలు..

|

Sep 15, 2023 | 1:00 PM

ఓ వార్త ఆన్ లైన్ ప్లాట్ ఫారంలలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే వాట్సాప్ లో యూడా యాడ్స్ వస్తాయి అని. చాట్ సమయంలో యాడ్స్ మనకు దర్శనమిస్తాయని, మెటా యాజమాన్యం తన రెవెన్యూను అమాంతం పెంచుకునేందుకు ఈ విధంగా చేస్తోందని ఓ రిపోర్టు నెట్టింట వైరల్ అయ్యింది. అయితే ఇది నిజమా? వాట్సాప్ లో కూడా ఫేస్ బుడ్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ ల మాదిరిగా యాడ్స్ తో నిండిపోనుందా?

WhatsApp: వాట్సాప్‌లో యాడ్స్ వస్తాయా? నిజమేనా? ఆదాయం కోసం కొత్త మార్గాలు వెతుకున్నారా? పూర్తి వివరాలు..
Whatsapp
Follow us on

వాట్సాప్ జనాలకు బాగా కనెక్ట్ అయిపోయింది. అది లేకుండా ప్రస్తుత సమాజాన్ని ఊహించలేం అంటే అతిశయోక్తి కాదేమో. అంతలా వాట్సాప్ తన ముద్ర వేసుకుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగానే వాట్సాప్ యాజమాన్యం కూడా ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్లు ఫీచర్లను పరిచయం చేస్తూ తన విస్తృతిని మరింత పెంచుకుంటోంది. ఈ క్రమంలో ఓ వార్త ఆన్ లైన్ ప్లాట్ ఫారంలలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే వాట్సాప్ లో యూడా యాడ్స్ వస్తాయి అని. చాట్ సమయంలో యాడ్స్ మనకు దర్శనమిస్తాయని, మెటా యాజమాన్యం తన రెవెన్యూను అమాంతం పెంచుకునేందుకు ఈ విధంగా చేస్తోందని ఓ రిపోర్టు నెట్టింట వైరల్ అయ్యింది. అయితే ఇది నిజమా? వాట్సాప్ లో కూడా ఫేస్ బుడ్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ ల మాదిరిగా యాడ్స్ తో నిండిపోనుందా? దీనిపై వాట్సాప్ హెడ్ ఏమంటున్నారా? తెలుసుకుందాం రండి..

పక్కా ఫేక్ న్యూస్..

వాట్సాప్ లో యాడ్స్ అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా ఫేక్ అని తేలిపోయింది. వాట్సాప్ హెడ్ విల్ క్యాత్ కార్ట్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. శుక్రవారం కొన్ని మీడియా రిపోర్టుల్లో వచ్చినట్లుగా మెటాకు చెందిన వాట్సాప్ మెసేజింగ్ ప్లాట్ ఫారం ఎటువంటి యాడ్స్ ను ప్రవేశపెట్టడం లేదని తేల్చి చెప్పారు. అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి ఇలా అడ్వర్టైజ్ మెంట్ లను వినియోగించనున్నట్లు వస్తున్న వార్తలను పూర్తిగా ఆయన ఖండించారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఆయన ఓపోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

అసలు రిపోర్టులో ఏముంది..

వాస్తవానికి ఎఫ్టీ రిపోర్టులో మెటా యాజమాన్యంలోని వాట్సాప్ లో యాడ్స్ ను జొప్పిస్తున్నారని, సంస్థ అదనపు రెవెన్యూ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని ఉంది. మెటా కేవలం అదనపు ఆదాయార్జనే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొంది. వాట్సాప్ చాట్ స్క్రీన్‌పై పరిచయాలతో సంభాషణల జాబితాలలో ప్రకటనలను చూపించాలా వద్దా అని మెటాలోని బృందాలు చర్చిస్తున్నాయని ఎఫ్టీ నివేదించింది, అయితే తుది నిర్ణయాలు తీసుకోలేదని అభివృద్ధికి దగ్గరగా ఉన్న వర్గాలు ప్రచురణకు తెలియజేసాయని వివరించింది. మెటా యాప్‌ను యాడ్-ఫ్రీగా ఉపయోగించడానికి సబ్‌స్క్రిప్షన్ ఫీజును జోడించడాన్ని కూడా పరిశీలిస్తోందని, అయితే చాలా మంది కంపెనీ అంతర్గత వ్యక్తులు దీనికి వ్యతిరేకంగా స్వరం వినిపించారని నివేదిక పేర్కొంది. అయితే, వాట్సాప్ ఈ వాదనలన్నింటినీ కొట్టిపారేసింది.

ఈ క్రమంలోనే వాట్సాప్ హెడ్ క్యాత్ కార్ట్ తన ట్విట్టర్ ఖాతాలో దీనిని ఖండించారు. ఇదంతా ఫాల్స్ న్యూస్ అని కొట్టి పారేశారు. ట్విట్టర్ లో ఆయన పోస్ట్ చేస్తూ ఎఫ్టీ విడుదల చేసిన రిపోర్టును ట్యాగ్ చేస్తూ.. ఇది ఫాల్స్ స్టోరీ అని ట్యాగ్ చేశారు. అలాగే బ్రియాన్ పేరు కూడా తప్పుగా చెప్పారు అంటూ చురకలంటించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..