Whatsapp: యూజర్లకు సరికొత్త చాటింగ్ అనభూతిని పరిచయం చేసింది వాట్సాప్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ మొదటి వరుసలో ఉంటుదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది కాబట్టే దీనికి ఇంతలా పాపులారిటీ ఉంది. ఇదిలా ఉంటే వాట్సాప్ ఉపయోగిస్తున్న యూజర్లు ఇటీవల ఓ సమస్యను ఎదుర్కొంటున్నారు. వాట్సాప్ ఉన్నట్టుండి దానంతట అదే లాగవుట్ అవుతుండడమే ఆ సమస్య. ‘మీ వాట్సాప్ నెంబర్ ఈ ఫోన్‌లో రిజిస్టర్ అయి లేదు. బహుశా ఈ నెంబర్‌పై వేరే ఫోన్‌లో రిజిస్టర్ అయి ఉండొచ్చు. ఒకవేళ ఇలా అలా కాకుండా ఉంటే.. వెంటనే మరోసారి మీ ఫోన్ నెంబర్‌ను నిర్ధారించుకోండి’ అంటూ మెసేజ్ వస్తోంది.
దీంతో యూజర్లు ఆందోళన చెందుతున్నారు. తమ వాట్సాప్‌ను ఎవరైనా హ్యాక్ చేశారా అని అనుమానిస్తోన్న తరుణంలో.. ఇలాంటి మెసేజ్ వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది వాట్సాప్. బ్యాక్ ఎండ్ కోడ్‌లో వచ్చిన చిన్న బగ్ కారణంగానే ఈ సమస్య వస్తోందని.. యూజర్లు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని.. తిరిగి వాట్సాప్‌లోకి లాగిన్ కావొచ్చని డబ్ల్యూఏబీటా ఇన్ఫో ట్విట్టర్ వేదికగా తెలిపింది. దీంతో తమ వాట్సాప్‌కు ఏమైందని భావించిన వారు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే వాట్సాప్ ఇటీవల మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్‌తో యూజర్ ఒక మొబైల్ నుంచి ఇతర డివైజ్‌లకు వెబ్ వాట్సాప్ వాడుకోవచ్చు. ఒకే సారి నాలుగు డివైజ్‌లలో ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చు. ప్రస్తుతం కొందరికి మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.
If you have been recently logged out from WhatsApp, on WhatsApp for Android, don’t worry: it’s a bug. You can log into WhatsApp again. pic.twitter.com/SnhFzUd5jP
— WABetaInfo (@WABetaInfo) August 8, 2021
Also Read: YS Sharmila: ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గంలో షర్మిల దీక్ష.. పోటీపై కీలక ప్రకటనకు ఛాన్స్..