వాట్సాప్‌లో వదంతులు ఎవరు పోస్ట్ చేస్తున్నారో తెలిసిపోతుందట..

వాట్సాప్.. ప్రస్తుతం సులభంగా సమాచారం ఇతరులకు అందివ్వడంలో.. అన్నింటికన్నా ముందున్న సామాజిక మాధ్యమం. అయితే దీని ద్వారా విలువైన సమాచారమే కాకుండా.. వదంతులు కూడా వ్యాప్తిచెందుతున్నాయి. అయితే ఈ వదంతులను ఎవరు పంపిస్తున్నారో గుర్తించడం కష్టంగా ఉండేది. దీంతో ఆకతాయిలు అదే పనిగా దీని ద్వారా వదంతులను షేర్ చేస్తూ.. అలజడి సృష్టించేవారు. అయితే ఈ వదంతులు ఎవరు ప్రారంభిస్తున్నారు.. ఎవరు తొలుత ఈ సందేశాన్ని పోస్ట్ చేస్తున్నారన్నమూలాలను కనుగొనేందుకు ఐఐటీ-మద్రా స్‌కు చెందిన ఓ ప్రొఫెసర్‌ […]

వాట్సాప్‌లో వదంతులు ఎవరు పోస్ట్ చేస్తున్నారో తెలిసిపోతుందట..
Follow us

| Edited By:

Updated on: Aug 09, 2019 | 9:48 AM

వాట్సాప్.. ప్రస్తుతం సులభంగా సమాచారం ఇతరులకు అందివ్వడంలో.. అన్నింటికన్నా ముందున్న సామాజిక మాధ్యమం. అయితే దీని ద్వారా విలువైన సమాచారమే కాకుండా.. వదంతులు కూడా వ్యాప్తిచెందుతున్నాయి. అయితే ఈ వదంతులను ఎవరు పంపిస్తున్నారో గుర్తించడం కష్టంగా ఉండేది. దీంతో ఆకతాయిలు అదే పనిగా దీని ద్వారా వదంతులను షేర్ చేస్తూ.. అలజడి సృష్టించేవారు. అయితే ఈ వదంతులు ఎవరు ప్రారంభిస్తున్నారు.. ఎవరు తొలుత ఈ సందేశాన్ని పోస్ట్ చేస్తున్నారన్నమూలాలను కనుగొనేందుకు ఐఐటీ-మద్రా స్‌కు చెందిన ఓ ప్రొఫెసర్‌ రెండు పరిష్కారాలు సూచించారు.

సామాజిక మాధ్యమాలపై దాఖలైన రెండు వ్యాజ్యాలను విచారిస్తున్న మద్రాసు హైకోర్టు.. వాట్సాప్‌లో వదంతుల సమస్యకు పరిష్కారాలు సూచించాలని జాతీయ భద్రత సలహా మండలి సభ్యుడు, ఐఐటీ-ఎం ప్రొఫెసర్‌ కామకోటికి సూచించింది. అయితే గత నెల 31న ఆయన రెండు పరిష్కారాలను కోర్టుకు నివేదించారు. అందులో మొదటిది.. వాట్సాప్‌ సందేశాలతోపాటు మొదట పంపిన వ్యక్తి సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్‌ అయ్యేలా చేయడం. సందేశంలో ఎన్‌క్రిప్ట్‌ అయిన మూలాలను డీక్రిప్ట్‌ చేసి విశ్లేషిస్తే వదంతిని తొలుత వ్యాప్తి చేసిందెవరో తెలిసిపోతుంది.

ఇక రెండో సూచనలో.. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందిందని గుర్తించగానే దాన్ని ఎన్‌క్రిప్ట్‌ చేసి, ఆ సందేశం కనిపించకుండా చేయడం.. అంటే.. ఆ సమాచారం అంతకు ముందు ఇన్‌బాక్సులో ఉన్నవారికి కూడా కనిపించదు. అయితే.. వదంతులను కాపీ, పేస్ట్‌ చేసి ఫార్వర్డ్‌ చేసినా.. ఫొటోలు, వీడియోలు, ఆడియో ఫైళ్లు జోడించి ఇతరులకు పంపినా.. దాన్ని మొదటి సందేశంగా అంటే పరిగణిస్తారు. ఈ విధంగా చేస్తే.. వదంతుల వ్యాప్తికి చెక్ పెట్టొచ్చంటూ ఫ్రోఫెసర్ వెల్లడించారు. సో.. ఇక నుండి ఏదైనా పోస్ట్ చేసే ముందు అది సరైనదో కాదో.. చూసి ఫార్వర్డ్ చేయండి. లేదంటే.. సైబర్ నేరాల కింద బుక్కవ్వడం ఖాయం.

Latest Articles