Vivo T4 5G: మొబైల్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. వివో నుంచి మరో సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌!

Vivo T4 5G: వివో.. ఈ ఫోన్‌కు మార్కెట్లో మంచి పేరుంది. వివో నుంచి రకరకాల స్మార్ట్‌ ఫోన్లు మార్కెట్లో విడుదల అవుతున్నాయి. ఇప్పటి వరకు ఎన్నో స్మార్ట్‌ ఫోన్‌లు విడుదల చేసింది. అయితే ఈ కంపెనీ నుంచి వచ్చే ఫోన్‌లలో ముఖ్యంగా కెమెరా క్లారిటీ బాగుంటుంది. అందుకే చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇప్పుడు మరో అద్భుతమైన ఫోన్‌ విడుదల కానుంది..

Vivo T4 5G: మొబైల్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. వివో నుంచి మరో సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌!

Updated on: Apr 14, 2025 | 6:04 PM

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ ఫోన్‌ ట్రెండ్‌ నడుస్తోంది. రోజురోజుకు కొత్త కొత్త స్మార్ట్‌ ఫోన్లు మార్కెట్లో విడుదల అవుతున్నాయి. ఇక స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీ వివోకు మార్కెట్లో మంచి పేరుంది. దీని నుంచి ఏ ఫోన్‌ విడుదలైనా అద్భుతమైన ఫీచర్స్‌తో ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. తాజాగా మరో ఫోన్‌ విడుదల కానుంది. Vivo T4 5G ఏప్రిల్ 22న భారతదేశంలో లాంచ్ కానుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుందని భావిస్తున్నారు. ఇది 6.67-అంగుళాల FHD+ క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు. ఈ ఫోన్‌ 50MP ప్రైమరీ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరాతో వచ్చే అవకాశం ఉంది. ఇది 7,300mAh బ్యాటరీతో వచ్చే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు భావిస్తున్నారు. అలాగే 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వవచ్చు. భారతదేశంలో Vivo T4 5G ధర దాదాపు INR 25,000 ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

 


మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి