Vivo V21E 5G: వివో వీ21ఈ 5జీ నూతన స్మార్ట్ ఫోన్ మనదేశంలో జూన్ 24న విడుదల కానుంది. ఈమేరకు కంపెనీ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. అయితే ఇంతకు ముందు విడుదల చేసిన 4జీ వెర్షన్ కంటే 5జీ వెర్షన్ లో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. ఈమేరకు కోహ్లి పోస్టర్ తో వివో తన ట్వీటర్‌లో ట్వీట్ చేసింది. వివో వీ21ఈ లైట్ బ్లూ కలర్ వేరియంట్‌తో విరాట్ కోహ్లీ కనిపించాడు. రూ.15 వేల లోపే ఈ ఫోన్ ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో 6.44 అంగుళాల ఫుల్‌హెచ్‌డీతోపాటు అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఉండనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ వర్క్ చేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది.
కెమెరాల విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో బ్యాక్ సైడ్ రెండు కెమెరాలతో రానుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కాగా, మరో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా అందించారు. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. వివో ఫన్‌టచ్ ఓఎస్ తో ఈ ఫోన్ పనిచేయనుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారంగా కంపెనీ మార్పులు చేసింది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్న ఈ ఫోన్ 44W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
అయితే ఇంతకు ముందు విడుదలైన 4జీ వర్షన్‌ను అప్‌గ్రేడ్ చేసి 5జీ వర్షన్‌గా విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. 4జీ వర్షన్ మలేషియాలో విడుదలైది. దీని ధర 1,299 యువాన్లుగా(దాదాపు రూ.23,000) ఉంది. ఈ ఫోన్ 6.44 అంగుళాల డిస్‌ప్లేతోపాటు క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇందులో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, వెనుకవైపు 64 మెగాపిక్సెల్ తోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ తో మూడు కెమెరాలు అందించారు. ముందువైపు 44 మెగాపిక్సెల్ కెమెరాతో విడులైంది.
Being true to your style is all that matters.
Presenting @imVkohli with the sleek and stylish #vivoV21e.#DelightEveryMoment #MostStylish5G #ComingSoon pic.twitter.com/DNGI6oQeS9— Vivo India (@Vivo_India) June 18, 2021
Also Read:
Father’s Day 2021: ‘పాపా మేరే పాపా’ స్టిక్కర్స్‌ను లాంచ్ చేసిన వాట్సప్! ఇలా డౌన్‌లోడ్ చేయండి..!
Realme Smartphones: రూ. 15వేల లోపే రెండు ఫోన్లు, స్మార్ట్ టీవీని లాంచ్ చేయనున్న రియల్‌మీ..!