Vivo Y200 5G: వివో నుంచి మరో 5జీ ఫోన్.. ఫీచర్లపై ఓ లుక్కేయండి..
ఇక బడ్జెట్ ధరలోనే 5జీ ఫోన్స్ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో మార్కెట్లోకి మరో కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. వివో వై200 పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకురానుంది. త్వరలోనే మార్కెట్లోకి ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్స్ ఉండనున్నాయి.? ధర ఎంత లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భారత్‌లో 5జీ నెట్‌వర్క్ విస్తరిస్తోంది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇండియన్ టెక్ మార్కెట్లో వరుసగా 5జీ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. దాదాపు అన్ని స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీలు 5జీ ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తున్నాయి.
ఇక బడ్జెట్ ధరలోనే 5జీ ఫోన్స్ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో మార్కెట్లోకి మరో కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. వివో వై200 పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకురానుంది. త్వరలోనే మార్కెట్లోకి ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్స్ ఉండనున్నాయి.? ధర ఎంత లాంటి పూర్తి వివరాలు మీకోసం..
ఈ ఫోన్‌కు సంబంధించి వివో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ ఆన్‌లైన్‌లో లీక్ అయిన సమాచారం ఆధారంగా ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఎఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ డిస్‌ప్లే సొంతం. ఇక ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింటర్ స్కానర్‌ను అందించనున్నారు. ఈ ఫోన్ 190 గ్రాముల బరువు ఉండనుంది. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు.
ఇక సెల్ఫీ ఫొటోలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. వివో వై200 స్మార్ట్ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ఎస్‌ఓసీ చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించనున్నారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పని చేయనుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ విషయనికొస్తే ఇందులో 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4800 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.
ఇక వివో వై200 5జీ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే ఇందులో.. ఈ స్మార్ట్ ఫోన్ బేసిక్ ధర రూ. 24 వేలుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌ను వివో.. మోటోరోలా ఎడ్జ్ 40 నియో, పోకో ఎఫ్5, ఇన్ఫీనిక్స్ జీరో 30 5జీ వంటి స్మార్ట్ ఫోన్స్‌కు పోటీగా లాంచ్ చేయనున్నట్లు చెబుతున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..