Samsung Galaxy A05s: సామ్‌సంగ్‌ నుంచి మరో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌.. మైండ్‌ బ్లోయింగ్ ఫీచర్స్‌..

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ05ఎస్‌ పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్‌ 18వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్‌ చేయనున్నారు. బడ్జెట్‌ ధరలోనే ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. ధరపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ రూ. 15వేలలోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. గత నెలలో సామ్‌సంగ్ తీసుకొచ్చిన గ్యాలక్సీ....

Samsung Galaxy A05s: సామ్‌సంగ్‌ నుంచి మరో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌.. మైండ్‌ బ్లోయింగ్ ఫీచర్స్‌..
Samsung Galaxy A05s
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 14, 2023 | 11:20 PM

ప్రస్తుతం బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని మార్కెట్లోకి 5జీ స్మార్ట్ ఫోన్స్‌ లాంచ్‌ అవుతున్నాయి. చైనాకు చెందిన కొన్ని స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు మాత్రమే కాకుండా సామ్‌సంగ్ వంటి టాప్‌ బ్రాండ్స్‌ కూడా తక్కువ బడ్జెట్‌లో 5జీ ఫోన్స్‌ను లాంచ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సామ్‌సంగ్ మరో బడ్జెట్ 5జీ ఫోన్‌ను తీసుకొస్తోంది.

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ05ఎస్‌ పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్‌ 18వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్‌ చేయనున్నారు. బడ్జెట్‌ ధరలోనే ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. ధరపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ రూ. 15వేలలోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. గత నెలలో సామ్‌సంగ్ తీసుకొచ్చిన గ్యాలక్సీ ఏ05 మోడల్‌కు కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు.

ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్లపై ఇప్పటి వరకు కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ నెట్టింట లీక్‌ అయిన సమాచారం ప్రకారం ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఉండనున్న ఫీచర్స్‌ ఇవేనని లీక్స్‌ వస్తున్నాయి. వీటి ఆధారంగా ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించనున్నారు. ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించనున్నారు. సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు.

ఇక సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ05ఎస్‌ స్మార్ట్ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌ను అందించనున్నారు. బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు. అలాగే 2 ఏళ్ల ఆపరేటింగ్ సిస్టమ్‌, 4 ఏళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను ఇవ్వనున్నారు. గ్రీన్‌, బ్లాక్‌ కలర్స్‌లో మొబైల్‌ను లాంచ్‌ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ ఫోన్‌లో 12జీబీ ర్యామ్‌ను ఇవ్వనున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..