5G Smartphone: వివో నుంచి కొత్త 5జీ ఫోన్.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు చూస్తే వావ్ అనాల్సిందే..

|

Apr 25, 2023 | 7:00 PM

చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వివో మరో 5జీ ఫోన్ ని మార్కెట్లోకి లాంచ్ చేసింది. వివో వై78 ప్లస్ 5జీ పేరిట చైనాలో దీనిని ఆవిష్కరించింది. దీనిలో విశేషమేమిటంటే వివో వై సిరీస్ ఫోన్లలో ఇదే మొదటి కర్వ్ డ్ డిస్ ప్లే మోడల్.

5G Smartphone: వివో నుంచి కొత్త 5జీ ఫోన్.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు చూస్తే వావ్ అనాల్సిందే..
Vivo Y78 Plus 5g
Follow us on

చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వివో కొత్త 5జీ ఫోన్ ని మార్కెట్లోకి లాంచ్ చేసింది. వివో వై78 ప్లస్ 5జీ పేరిట చైనాలో దీనిని ఆవిష్కరించింది. దీనిలో విశేషమేమిటంటే వివో వై సిరీస్ ఫోన్లలో ఇదే మొదటి కర్వ్ డ్ డిస్ ప్లే మోడల్. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర, లభ్యత వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

డిస్ ప్లే.. వివో వై 78ప్లస్ 5జీ ఫోన్లో 6.78 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ మెంట్ రేట్ ఉంటుంది. స్క్రీన్ రిజల్యూషన్ 2400*1080 ఉంటుంది. ఇది ఏకంగా 16.7 మిలియన్ కలర్స్ ను చూపించగలుగుతుంది. దీని బరువు 177గ్రాములు, మందం 7.89ఎంఎం ఉంటుంది.

సామర్థ్యం.. దీనిలో ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 695 5జీ చిప్ సెట్ ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 619 జీపీయూ ఉంటుంది. ఇది ఫోన్ 8జీబీ, 12జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో లభిస్తున్నాయి. ఇది ఒరిజినోస్ 3పై ఆధారపడి పనిచేసే ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఉంటుంది. దీనిలో బ్యాటరీ 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉంటుంది. అంతే కాక 44 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు కూడా లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

కెమెరా.. ఇక కెమెరా సెటప్ విషయానికి వస్తే వెనుక వైపు 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ సెకండరీ లెన్స్ ఉంటాయి. ముందు వైపు 8ఎంపీ సెల్పీ కెమెరా ఉంటుంది. దీనిలో నైట్, పోర్ట్రేట్, డ్యూయల్ వ్యూ, పనోరమా, టైమ్ ల్యాప్స్, డైనెమిక్ ఫోటో వంటి ఫీచర్లను కలిగి ఉంది. అలాగే వైఫై, బ్లూటూత్ 5.1 యూఎస్బీ టైప్ సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లతో వస్తుంది.

ధర ఎంతంటే.. ఈ ఫోన్ 8జీబీ/128జీబీ ధర 1599 యాన్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 19,000 ఉంటుంది. అలాగే 8జీబీ/256జీబీ వేరియంట్ ధర 1799 యాన్లు,మన కరెన్సీలో రూ. 21,500 వరకూ ఉంటుంది. అదే విధంగా 12జీబీ/256జీబీ వేరియంట్ ధర 1999యాన్లు, సుమారుగా రూ. 23,800 ఉంటుంది. ఇది మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అజ్యూర్, వార్మ్ సన్ గోల్డ్, మూన్ షాడో కలర్స్ కేవలం చైనాలో మాత్రమే ఇది లభ్యమవుతుంది. మన దేశంలో ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుందో కంపెనీ వెల్లడించలేదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..