iPhone 13 Pro Max: టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండటంతో వైద్య రంగంలో కూడా ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న నిపుణులు వైద్య విధానంలో చరిత్ర సృష్టిస్తున్నారు. మన శరీరభాగాల్లో అని సున్నితమైన కంటికి యాపిల్ ఐఫోన్13తో వైద్యం చేస్తున్నాడు ఓ వైద్యుడు. కంటి చూపును మెరుగుపర్చడానికి ఐఫోన్‌తో అద్భుతాలు చేస్తున్నారు ‘టామీ కార్న్’ అనే వైద్యుడు. ఫోన్‌లో ఉన్న మ్యాక్రోమోడ్ టెక్నాలజీని ఉపయోగించి కంటిచూపు సమస్యలను ఐఫోన్‌తో పరిష్కరిస‍్తున్నారు. ఇది వినటానికి వింతగా అనిపించినా.. ఆ వైద్యుని వద్ద ఈ ఐఫోన్ చికిత్స తీసుకున్న పేషెంట్లు కూడా తమ చూపు మెరుగైందని చెప్పుకొస్తున్నారు. డాక్టర్ టామీ కార్న్ చేస్తున్న ఈ ఐఫోన్ ఐ చికిత్స గురించి పలువురు నిపుణులు సైతం ఇదొక మెడికల్ మిరాకిల్ అని అంటున్నారు.
డాక్టర్ టామీ కార్న్ ఆప్తమాలజిస్ట్. అమెరికా కాలిఫోర్నియాలోని శాన్‌డియాగో అనే ప్రాంతానికి చెందినవారు. ఆయన కార్న్ టెక్సాస్ సౌత్ వెస్ట్రన్ మెడికల్ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్నారు. ఆ తరువాత గత 21 ఏళ్లుగా కంటి వైద్యుడిగా ఎంతోమంది పేషెంట్లు కంటిచూపు మెరుగుపర్చారు. ఆయన చేతులతో ఎన్నో కంటి ఆపరేషన్లు కూడా చేశారు. ప్రస్తుతం ఆయన షార్ప్ మెమోరియల్ ఆస్పత్రిలో ప్రముఖ ఆప్తమాలజిస్ట్‌గా,డిజిటల్ ఇన్నోవేటర్(టెక్నాలజీతో చేసే వైద్యం)గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో డాక్టర్ టామీ కార్న్ ఐఫోన్13 ప్రో మ్యాక్స్‌లో ఉన్న మ్యాక్రోమోడ్‌ని ఉపయోగించి ‘ఐ’ చికిత్స చేస్తు పలువురు పేషెంట్లకు కంటిచూపుని అందించడంతో పాటు పలువురు నిపుణుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.
అంతేకాకుండా ఈ టెక్నాలజీ ద్వారా కంటి చూపు ఏ స్థాయిలో ఉందో గుర్తించి ఫోటోలను సైతం క్యాప‍్చర్ చేస్తున్నారు. ఆ ఫోటోల సాయంతో కార్నియా ఆపరేషన్ తరువాత వచ్చే కార్నియా రాపిడి సమస్యలకు పరిష్కరిస్తున్నారు. సాధారణ చికిత్సతో చేయలేని పలు సున్నితమైన సమస్యలను మ్యాక్రోమోడ్ ఫీచర్ తో కంటికి చికిత్స ఎలా చేస్తున్నారో లింక్డిన్‌లో పోస్ట్ చేశారు.
ఒకప్పుడు ఫోటోలు తీయాలంటే ఫోటోగ్రాఫర్ కావాల్సి ఉండేది. ఫోటోగ్రఫీ గురించి ఓ ప్రత్యేక ఎడ్యుకేషనే ఉండేది. ఇప్పటికి ఉంది కూడా. కానీ ఇప్పుడలా కాదు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటేచాలు ఎవ్వరైనా ఫోటోలు తీయచ్చు. అటువంటిది చేతిలో ఐ ఫోన్ ఉంటే ఫోటో స్టైలో వేరు. ఆ ఫోన్‌తో తీసిన ఫోటోల క్లారిటీయే వేరు. అలాబసినిమాటిక్ మోడ్, మ్యాక్రోమోడ్ ఫీచర్ల సాయంతో సాధారణ లొకేషన్లలో అందంగా ఫోటోలను క్యాప్చర్ చేయవచ్చు. ఇప్పుడు ఐఫోన్13 ప్రో మ్యాక్స్‌లో ఉన్న మ్యాక్రోమోడ్ ఫీచర్‌ను ఉపయోగించే డాక్టర్ టామీ కార్నియాకు సంబంధించి కంటి వైద్యం చేస్తున్నారు. ఫోన్లో ఎన్ని ఫోటో ఫీచర్స్ ఉన్నా.. మ్యాక్రోమోడ్ అనేది వెరీ స్పెషల్. దీంట్లో భాగంగా ఫన్ ఎగ్జాంపుల్..కంట్లో ఉన్న అతి సూక్ష్మమైన నలుసుని కూడా ఈ అడ్వాన్స్‌డ్ మ్యాక్రోమోడ్ టెక్నాలజీతో హెచ్‌డీ క్వాలిటీ ఫోటోలను తీయవచ్చు. ఇప్పుడు అదే చేస్తున్నారు డాక్టర్ టామీ కార్న్.
అయితే కంటిలో ముందు భాగాన్ని కార్నియా అంటారనే విషయం తెలిసిందే. ఈ కార్నియా చాలా పలచగా అత్యంత సున్నితంగా ఉంటుంది. వెలుతురిని కంటి లోపలి భాగాలకు చేరవేయటంలో కార్నియాది కీలకపాత్ర వహిస్తుంది. కార్నియా ఆపరేషన్ చాలా సున్నితమైనది కూడా. ఈక్రమంలో కార్నియా ఆపరేషన్ చేయించుకున్నన్న ఓ వ్యక్తి సమస్యకు పరిష్కారం చూపారు డాక్టర్ టామీ. సాధారణంగా కార్నియా ఆ ఆపరేషన్ తరువాత తాత్కాలికంగా కంటి లోపల రాపిడి జరుగుతుంది. ఆ సమస్యను అధిగ మించేలా ఐఫోన్ 13లో ఉన్న మ్యాక్రో మోడ్‌తో కంట్లో కార్నియాను చెక్ చేశారు.
ఆ తరువాత ఆ సమస్య గురించి డాక్టర్ టామీకార్న్ సదరు పేషెంట్‌ను అడిగారు. ఇప్పుడెలా ఉంది? అని..దానికి సదరు వ్యక్తి ఇప్పుడు నా కంటిచూపు మెరుగుపడింది..అని ఆనందం వ్యక్తం చేశాడు. ఆ పేషెంట్‌కు అందించిన చికిత్స విధానాన్ని డాక్టర్ సోషల్ మీడియాలో షేర్ చేయటంతో దానికి ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.