Viral: చదివింది ఇంటర్.. ‘ఆవిష్కరణ’ అమోఘం.. అదేంటో చూస్తే శభాష్ అంటారు..!

Viral: మద్యం తాగి వాహనాలు నడపడం, హెల్మెట్ ఉపయోగించకపోవడం వల్ల దేశంలో రోడ్డు ప్రమాదాల్లో రోజూ వందల మంది చనిపోతున్నారు.

Viral: చదివింది ఇంటర్.. ‘ఆవిష్కరణ’ అమోఘం.. అదేంటో చూస్తే శభాష్ అంటారు..!
Boys
Follow us

|

Updated on: Aug 15, 2022 | 5:41 PM

Viral: మద్యం తాగి వాహనాలు నడపడం, హెల్మెట్ ఉపయోగించకపోవడం వల్ల దేశంలో రోడ్డు ప్రమాదాల్లో రోజూ వందల మంది చనిపోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య ఏటా పెరుగుతోంది. అయితే, ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు ఛత్తీస్‌గఢ్‌లోని కవార్ధా జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు అద్భుతాన్ని కనిపెట్టారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఈ యువకులు ప్రత్యేక పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరాన్ని ద్విచక్ర వాహనాల్లో వాడటం ద్వారా ప్రమాదాలను అరికట్టొచ్చు. దీని తయారీకి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువే కావడం విశేషం.

గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు.. కవర్ధా జిల్లాలోని ఛాటా అనే చిన్న గ్రామానికి చెందిన ఈ ముగ్గురు యువకులు హీరేంద్ర పటేల్, భూపేంద్ర పటేల్, యువరాజ్ పటేల్. ఈ ముగ్గురి కుటుంబం వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తోంది. ఈ ముగ్గురూ 12వ తరగతి ఉత్తీర్ణులై డిగ్రీ చేస్తున్నారు. ఈ క్రమంలో వారి మదిలో ఓ ఆలోచన తట్టింది. మద్యం మత్తులో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుండటం వారిని కలచివేసింది. ఆ క్రమంలో ఈ ప్రమాదాలకు చెక్ పెట్టాలని భావించారు. ఆలోచన వచ్చిందే తడవు.. మెదడుకు పదును పెట్టి.. అద్భుతాన్ని ఆవిష్కరించారు. అది చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.

హెల్మెట్ లేకపోయినా, మద్యం సేవించినా బైక్ స్టార్ట్ అవదు.. ఈ ముగ్గురు యువకులు బైక్ మైలియోమీటర్‌‌లో తాము తయారు చేసిన చిన్న పరికరాన్ని ఏర్పాటు చేస్తారు. హెల్మెట్‌కు కూడా ఓ పరికరాన్ని ఫిట్ చేస్తారు. దీని కారణంగా.. హెల్మెట్ ధరించకుండా బైక్ స్టార్ట్ చేస్తే అది స్టార్ట్ అవదు. తలకిందులు తపస్సు చేసినా బండి ముందుకు కదలదు. అదే హెల్మెట్ పెట్టుకుని స్టార్ట్ చేస్తే.. వెంటనే స్టార్ అయిపోతుంది. అలాగే మద్యం సేవించి బైక్ స్టార్ట్ చేసినా.. అది స్టార్ట్ అవదు. ఇలా వ్యక్తుల ప్రాణాలు కాపాడే పరికరాన్ని తయారు చేసి అందరితో ఔరా అనిపించుకుంటున్నారు.

ఈ ముగ్గురు యువకులు బైక్ మైలియోమీటర్‌లో తాము తయారు చేసిన చిన్న పరికరాన్ని పెట్టి.. హెల్మెట్‌కు కూడా ఓ పరికరాన్ని పెట్టారు.హెల్మెట్ ధరించకుండా బైక్ స్టార్ట్ చేసేందుకు యువకుడు ప్రయత్నించినా బైక్ స్టార్ట్ అవ్వకపోవడం మనం చూశాం. హెల్మెట్ పెట్టుకుని బైక్ స్టార్ట్ చేయగానే ఒక్క కిక్ కి స్టార్ట్ అవుతుంది.. అంతే కాదు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మొదట హెల్మెట్ పెట్టుకుని బైక్ స్టార్ట్ చేయగా.. ఒక్కసారిగా బైక్ స్టార్ట్ చేశాడు. అదే వ్యక్తి మద్యం సేవించి హెల్మెట్ పెట్టుకుని బైక్ స్టార్ట్ చేయగా అది కూడా స్టార్ట్ కాలేదు. ఈ పరికరాన్ని మార్కెట్‌లో తీసుకువచ్చేందుకు యువకులు ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విషయమైన రాష్ట్ర రవాణా మంత్రి కూడా కలిశారు ఆ యువకులు. వారి ఆవిష్కరణను ప్రశంసించిన మంత్రి.. అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

మరిన్ని సైన్స్&టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో