నేటి డిజిటల్ యుగంలో ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం బాగా పెరిగింది. అవి లేకపోతే ఏ పని జరగని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఐఫోన్లు, మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్‌లు, వాచ్‌లు తదితర వాటికి డిమాండ్ పెరిగింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ కంపెనీలు అనేక మోడళ్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. అనేక ప్రత్యేక ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల కోసం విజయ్ సేల్స్ సంస్థ ప్రత్యేకంగా ఆపిల్ డేస్ సేల్ ను ప్రారంభించింది. ఆపిల్ కంపెనీ ఎలక్ట్రానిక్ వస్తువులపై డిస్కౌంట్ అందజేస్తుంది. ఐఫోన్లు, మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్లు, ఆపిల్ వాచ్‌లు తదితర అనేక రకాల ఆపిల్ ఉత్పత్తులపై డిస్కౌంట్లపై అందుబాటులో ఉన్నాయి.
దేశంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్ స్టోర్ అయిన విజయ్ సేల్స్ ఇటీవల ఆపిల్ డేస్ సేల్స్ ను ప్రారంభించింది. ఆపిల్ ఉత్పత్తులైన ఐఫోన్లు, మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్‌లు, వాచ్‌లు తదితర అనేక వాటిపై డిస్కౌంట్ అందిస్తోంది. ఈనెల 16న మొదలైన ఈ సేల్ ఈ నెల 24 వరకూ అందుబాటులో ఉంటుంది. ఇది ఎలక్ట్రానిక్స్ ప్రియులకు పండగ లాంటింది. విజయ్ సేల్స్ సంస్థ దుకాణాలు లేదా వారి వైబ్ సైట్ లో మనం వస్తువులను కొనుగోలు చేయవచ్చు.
మీకు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు క్రెడిట్ కార్డు ఉంటే మరింత లాభం పొందవచ్చు. సంస్థ ప్రవేశపెట్టిన ప్రత్యే క ఆఫర్ ప్రకారం హెచ్ డీఎఫ్ సీ కార్డు దారులకు కోనుగోళ్లపై రూ.5000 వరకూ తగ్గింపు లభిస్తుంది. మీరు విజయ్ సేల్స్ స్టోర్ లో షాపింగ్ చేస్తే రూ.10 వేలు విలువైన ఎక్సేంజ్ బోనస్ పొందవచ్చు. ఈ సంస్థలో లభించే వస్తువులు, వాటి ధరలు, డిస్కౌంట్ల గురించి తెలుసుకుందాం.
ఐఫోన్ 15 ప్రో.. విజయ్ సేల్స్ ఆపిల్ డేస్ సందర్భంగా ఐఫోన్ ధరలను బాగా తగ్గించింది. సాధారణంగా 1టీబీ స్టోరేజ్ తో కూడిన ఐఫోన్ 15 ప్రో ధర రూ. 1,84,900. అదే ఇప్పుడు విజయ్ సేల్స్ లో రూ. 1,62,990కు అందిస్తున్నారు. కొనుగోలుదారులు హెచ్ డీఎఫ్ సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డును ఉపయోగిస్తే, అదనంగా మరో మూడు వేల రూపాయిల తగ్గింపు లభిస్తుంది. దీని వల్ల మనకు ఆ ఫోన్ 1,59,990కు దొరుకుతుంది. ఇంకా అనేక ఆఫర్లు ఉన్నాయి. 512 జీబీ కెపాసిటీ కలిగిన ఐఫోన్ 15 ప్రో తదితర ఇతర మోడళ్లకూ తగ్గింపు ధరలను వర్తింపు చేశారు. ఐఫోన్ 15 ప్రో మాక్స్ తదితర మోడళ్లపై కూడా కొనుగోలుదారుల కోసం ఆఫర్లు ప్రకటించారు.
ఐఫోన్ 15.. ఐఫోన్ 15 మోడల్ ఫోన్ రూ.70,490, ఐఫోన్ 15 ప్లస్ రూ. 79,820 ధరలలో అందుబాటులో ఉన్నాయి. వీటిని కొనుగోలు చేయడానికి హెచ్ డీఎఫ్ సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డును ఉపయోగిస్తే ఇంకొంచె లాభం పొందవచ్చు. ఐ ఫోన్ 15, ఐ ఫోన్ 15 ప్లస్ లకు రూ. 4 వేలు, ఐ ఫోన్ 15 ప్రో, ఐ ఫోన్ 15 ప్రో మాక్స్, ఐఫోన్ 14, ఐ ఫోన్ 14 ప్లస్ మోడళ్లపై రూ. 3 వేల తగ్గింపు ఉంది. అలాగే ప్రతి కొనుగోలు పై లాయల్టీ పాయింట్లు లభిస్తాయి.
ఐప్యాడ్.. ఐప్యాడ్ ల కొనుగోలుపై డిస్కౌంట్లతో పాటు లాయల్టీ పాయింట్లు లభిస్తాయి. 9వ జనరేషన్ ఐప్యాడ్ రూ.27,900కు అందుబాటులో ఉంది. హెచ్ డీఎఫ్ సీ క్రెడిట్, డెబిట్ కార్డుదారులకు రూ.2 వేలు తగ్గించి 25,900లకే ఇస్తున్నారు. దీనికి 194 లాయల్టీ పాయింట్లు అదనంగా లభిస్తాయి.
మ్యాక్‌బుక్.. ఎమ్3 చిప్ కలిగిన మ్యాక్ బుక్ ఎయిర్ ధర రూ.1,14,900. దీనిపై రూ.5 వేలు డిస్కౌంట్ ఉంది. అంటే రూ.1,09,900కి మ్యాక్ బుక్ ను కొనుగోలు చేయడంతో పాటు 824 లాయల్టీ పాయింట్లు పొందొచ్చు.
ఆపిల్ వాచ్.. విజయ్ సేల్స్ స్టోర్ లో ఆపిల్ వాచ్ 9వ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. వీటి ధరలు రూ. 38,810 నుంచి ప్రారంభమవుతాయి. అయితే రూ. 2,500 తగ్గింపుతో రూ. 36,310కి అందుబాటులో ఉంటాయి. ఈ మోడల్‌ను కొనుగోలు చేయడం ద్వారా మీకు 272 లాయల్టీ పాయింట్లు వస్తాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..