
ఈ రోజుల్లో ఉద్యోగం, చదువు, వినోదం అన్నీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌తోనే ముడిపడి ఉన్నాయి. చాలామంది ఇటు ఇల్లు, అటు ఆఫీసులలో గంటల తరబడి ల్యాప్‌టాప్‌ను చార్జర్‌కు కనెక్ట్ చేసి వాడుతుంటారు. అయితే ఇలా చేయడం వల్ల బ్యాటరీ లైఫ్‌టైమ్ తగ్గుతుందా? ల్యాప్‌టాప్‌కు నష్టం జరుగుతుందా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆధునిక ల్యాప్‌టాప్‌లు లిథియం-అయాన్ లేదా లిథియం-పాలిమర్ బ్యాటరీలతో వస్తాయి. వీటిలో ప్రత్యేకమైన బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉండటం వల్ల బ్యాటరీ 100 శాతం చేరిన తర్వాత అదనపు చార్జింగ్‌ను నియంత్రిస్తుంది. అత్యాధునిక ల్యాప్‌లు దీన్ని దృష్టిలో ఉంచుకునే తయారు చేస్తారు. అందువల్ల చార్జింగ్‌లో ఉండగానే ల్యాప్‌టాప్‌ను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఛార్జింగ్‌లో పెట్టి ల్యాప్‌టాప్‌ను వాడినా అది సురక్షితంగానే ఉంటుంది.
అయితే ఛార్జింగ్‌లో ఉంచి ల్యాప్‌టాప్‌ను గంటల తరబడి వాడితే.. హీట్ సమస్య ఏర్పడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. గేమింగ్, వీడియో ఎడిటింగ్, భారీ సాఫ్ట్‌వేర్‌ల వినియోగం వంటి పనులు చేస్తూ చార్జింగ్‌లో ఉంచితే ల్యాప్‌టాప్ హీట్ పెరిగే అవకాశం ఉంటుంది. అధిక వేడి కారణంగా బ్యాటరీ తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకని ఎల్లప్పుడూ ఛార్జింగ్‌లో ఉంచి ల్యాప్‌టాప్‌లను వాడుకోవద్దని సూచిస్తున్నారు.
అలాగే దుమ్ముదూళి ల్యాప్‌టాప్‌లోకి పోకుండా చూడటం, సరైన వెంటిలేషన్‌లో ల్యాప్‌లో పనిచేయడం, ఎప్పుడూ మధ్య నుంచే ల్యాప్‌టాప్‌ను ఓపన్ చేయడంతో ల్యాప్‌టాప్‌లు లైఫ్‌టైమ్ ఎక్కువ వస్తుంది. అలాగే వీటిలో ఎమైనా సమస్యలు వస్తే లోకల్ సెంటర్లలో కాకుండా.. ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లలోనే వాటిని రిపేర్ చేయించుకోవాలి. ల్యాప్‌టాప్ స్క్రీన్లను శుభ్రం చేసేందుకు వాటర్ స్ప్రేలను వాడకూడదు. థర్డ్‌పార్టీ యాప్‌లను కూడా ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేయకపోవడం మంచిది. ఇలాంటి జాగ్రత్తలతో మీ ల్యాప్ ఎక్కువకాలం సురక్షితంగా ఉంటుంది.