Google Chrome: గూగుల్‌ క్రోమ్‌ కొత్త అప్‌డేట్ .. మరింత వేగంగా పని చేయనున్న గూగుల్‌ వెబ్‌ బ్రౌజర్‌

Google Chrome: ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం ఇటీవల క్రోమ్‌ 89ను అప్‌డేట్‌ చేసిన గూగుల్‌.. తాజాగా ఐఓఎస్‌ యూజర్ల కోసం క్రోమ్‌ 91 వెర్షన్‌ను రూపొందించింది. ఈ కొత్త అప్‌డేట్‌తో బ్రౌజింగ్‌..

Google Chrome: గూగుల్‌ క్రోమ్‌ కొత్త అప్‌డేట్ .. మరింత వేగంగా పని చేయనున్న గూగుల్‌ వెబ్‌ బ్రౌజర్‌
Google Chrome

Updated on: Jun 01, 2021 | 7:10 AM

Google Chrome: ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం ఇటీవల క్రోమ్‌ 89ను అప్‌డేట్‌ చేసిన గూగుల్‌.. తాజాగా ఐఓఎస్‌ యూజర్ల కోసం క్రోమ్‌ 91 వెర్షన్‌ను రూపొందించింది. ఈ కొత్త అప్‌డేట్‌తో బ్రౌజింగ్‌ వేగం 23 శాతం పెరుగుతుందని గూగుల్‌ క్రోమ్‌ తెలిపింది. ఈ క్రోమ్‌ 91అప్‌డేడ్‌.. గూగుల్‌ వెబ్‌ బ్రౌజర్‌ పని తీరును మరింత మెరుగు పరుస్తుంది. తాజా అప్‌డేట్‌లోని స్పార్క్‌ ప్లగ్‌ కంపైలర్‌, అంతర్నిర్మిత కాల్స్‌ ఫీచర్స్‌ కారణంగా క్రోమ్‌ ఇప్పుడు 23 శాతం వరకు వేగంగా పని చేస్తుందని తాజాగా క్రోమియం బ్లాగ్‌ పోస్టులో గూగుల్‌ వెల్లడించింది. అయితే ఈ సరికొత్త అప్​డేట్​ యాపిల్​ ఫోన్లను వాడే క్రోమ్​యూజర్ల కోసం తీసుకువచ్చినట్లు వెల్లడించింది.

ఇక తాజా అప్‌డేట్‌తో ఐఓఎస్​ స్మార్ట్​ఫోన్లలో గూగుల్​ క్రోమ్​ తాజా వెర్షన్​ మునుపటి కంటే వేగంగా పనిచేస్తుంది. వేగవంతమైన పనితీరు కోసం కోడ్​ను వేగంగా ఆప్టిమైజ్ చేసే టెక్నిక్​ను దీనిలో ఉపయోగించింది. కాలింగ్​ ఫంక్షన్లను నివారించడానికి రూపొందించిన కోడ్​తో దీన్ని వేగంగా ప్రాసెస్​ చేయవచ్చు. ఈ గూగుల్ క్రోమ్ తాజా అప్‌డేట్‌ వి 8 ఇంజన్ మల్టిపుల్​ కంపైలర్లతో వస్తుంది.

ఇవీ కూడా చదవండి:

Gmail Storage Space: మీరు గూగుల్‌ ఫోటోస్‌లో 15జీబీల కంటే ఎక్కవ స్టోరేజీ చేసుకున్నారా..? ఇలా చేసుకోండి

Covid-19 from Wuhan lab: కృత్రిమంగానే వైరస్‌ సృష్టి.. వుహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా.. ‘డైలీ మెయిల్‌’ కథనంలో సంచలన నిజాలు