Money Earning with Twitter: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. తెలియనివారు కంటే.. వాడని వారుండరు అని చెప్పుకుంటే బెటరేమో. ఎందుకంటే ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో చిన్న మొదలు.. పెద్దల వరకు చాలా మంది సోషల్ మీడియాకు అడిక్ట్ అయిన వారే. ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియా తరచుగా చూస్తూనే ఉంటారు. అయితే, ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? అంటే ఉందనే చెప్పాలి. సోషల్ మీడియా ద్వారా కొందరు సమయాన్ని వృథా చేసుకుంటుంటే.. మరికొందరు మాత్రం తమ వ్యాపారాన్ని విస్తృతం చేసుకుంటూ డబ్బు సంపాదిస్తున్నారు. అయితే, తాజాగా ట్విట్టర్ తన యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకుస్తోంది. ‘సూపర్ ఫాలో’ పేరుతో ట్విట్టర్ అభివృద్ధి చేస్తోన్న ఈ ఫీచర్ ద్వారా యూజర్లు డబ్బు సంపాదించుకునే వెసులుబాటు కల్పించింది. ట్విట్టర్ తీసుకురానున్న ఈ ఫీచర్ ద్వారా అసలు డబ్బు ఎలా సంపాదించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
కొత్త ఫీచర్‌తో ట్విట్టర్ యూజర్లు.. లేటెస్ట్ వీడియోలు, ఎక్స్‌క్లూజీవ్ కంటెంట్, తాజా సమాచారం, ప్రత్యేక విషయాలు, ప్రత్యేక ఫోటోలు, ఇతర ఆసక్తికర విషయాలను పోస్ట్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. ఒక ట్విట్టర్ యూజర్ తన ఖాతాలో పోస్ట్ చేసే ఈ సమాచారం.. అతని ఫాలోవర్లు చూడాలంటే సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం వారు కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలా వారు చెల్లించే ఫీజు ద్వారా ట్విట్టర్ యూజర్లు మనీ సంపాదించవచ్చు. ఇక సబ్‌స్క్రైబ్ చేసుకున్న ఫాలోవర్లు మాత్రమే ఈ కంటెంట్‌ను చూసే అవకాశం ఉంది. సబ్‌స్క్రూబ్ చేసుకోని వారు ఈ కంటెంట్‌ను చూడలేరు.
Also read: