Twitter New Feature: ట్విట్టర్‌లో సరికొత్త పీచర్‌… అక్షరాల పరిమితికి ఇక హద్దులుండవ్‌..

|

Feb 05, 2022 | 4:27 PM

Twitter New Feature: రాజకీయనాయకులు, సినిమా నటీనటులు, క్రీడాకారులు ఎవరైనా సరే తాము చెప్పాలనుకున్న విషయాలను పదిమందికి తెలియజేయడానికి ట్విట్టర్‌ ను వెంటనే ఆశ్రయిస్తారు. వెంటనే..

Twitter New Feature: ట్విట్టర్‌లో సరికొత్త పీచర్‌... అక్షరాల పరిమితికి ఇక హద్దులుండవ్‌..
Twitter New Feature
Follow us on

Twitter New Feature: రాజకీయనాయకులు, సినిమా నటీనటులు, క్రీడాకారులు ఎవరైనా సరే తాము చెప్పాలనుకున్న విషయాలను పదిమందికి తెలియజేయడానికి ట్విట్టర్‌ ను వెంటనే ఆశ్రయిస్తారు. వెంటనే తమ ఫీలింగ్ ను షేర్ తెలియజేస్తూ.. ట్విట్(Tweet) చేస్తారు. అయితే అలా తమ ఫీలింగ్ ను ఎక్కువగా షేర్ చెయ్యాలంటే.. ఒక ట్వీట్ లో సరిపోదు. అందుకనే వరసగా ట్వీట్స్ చేస్తుంటారు. అలాంటికి వారి ఇబ్బందులను తొలగించడానికి ట్విట్టర్‌ సరికొత్త ప్రయత్నం చేసింది. అవును ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ ఓ సరికొత్త ఫీచర్‌ తీసుకొస్తోంది. ఈ ఫీచర్‌ ద్వారా ఇక హద్దులుండవంటోంది.

ఇక పై ఈ కొత్త ఫీచర్ సాయంతో ట్విట్టర్‌లో ఎవరైనా ఎంత పెద్ద వ్యాసాన్నయినా పోస్టు చేయొచ్చు. ఇప్పటివరకు ఉన్న అక్షరాల పరిమితికి ఈ ఫీచర్ తో గుడ్ బై చెప్పేయొచ్చు. మొదట్లో ట్విట్టర్ లో ఏదైనా విషయం పోస్ట్‌ చేయాలంటే ఒక పరిమితి ఉండేది. ఒక పోస్టుకు 140 అక్షరాలు దాటితే ట్విట్టర్ లో పోస్టు చేయడం కుదిరేది కాదు. ఆ తర్వాత కాలంలో దీనిని 280 అక్షరాలకు పెంచారు. అయినప్పటికీ ఏదైనా భారీ సమాచారం పోస్టు చేయాలంటే అనేక ట్వీట్లు చేయాల్సి వచ్చేది. అయితే ఈ కొత్త ఫీచర్ సాయంతో ఆ బాధ తొలగిపోనుంది. ‘ఆర్టికల్స్’ పేరుతో ట్విట్టర్ త్వరలోనే కొత్త ఫీచర్ ను ప్రవేశపెడుతోంది. మెనూలో దీనికి సంబంధించిన ఆప్షన్ కనిపిస్తుంది. అక్షరాల పరిమితికి సంబంధించి ట్విట్టర్ పై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ‘ఆర్టికల్స్’ ఫీచర్ తో ట్విట్టర్ ఆ విమర్శలు తొలగించుకునే అవకాశం ఉంది.

Also Read:

పోస్ట్‌మార్టం చేయబోతుండగా లేచి కూర్చున్న వ్యక్తి! షాక్‌ తిన్న వైద్యులు!!