ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్ ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎందరో టాప్ సెలబ్రిటీలు ట్విట్టర్‌ను ఉపయోగిస్తుంటారు. ఇందులో ఉండే ఫీచర్లే ట్విట్టర్‌కు ఇంతటి క్రేజ్‌ను తీసుకొచ్చిందని చెప్పాలి. ఇప్పటికే పలు ఆసక్తికరమైన ఫీచర్స్‌ను యూజర్లను అట్రాక్ట్ చేస్తూ వచ్చిన ట్విట్టర్ తాజాగా మరో ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇప్పటి వరకు వరకు ట్వీట్ చేసే సమయంలో ఫొటో లేదా వీడియోలో ఏదో ఒకటి మాత్రమే ట్వీట్ చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఒకటికి మించి ఒకేసారి పోస్ట్ చేయొచ్చు.
వీడియోలు, ఇమేజ్‌లు, జిఫ్ ఫైల్.. ఇలా ఒకే ట్వీట్‌లో మూడింటిని పొందుపరిచే అవకాశాన్ని ట్విట్టర్ తీసుకొస్తోంది. ఈ మూడింటినీ కలిపి ఒకే ట్వీట్ చేయొచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం ట్విట్టర్ ఈ అవకాశాన్ని అందించింది. దీంతో యూజర్లు తాము చెప్పదలుచుకున్న విషయాన్ని మరింత స్పష్టంగా ట్వీట్ చేయొచ్చని ట్విట్టర్ చెబుతోంది. ఈ ఫీచర్‌ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చారు.
Get ready to mix it up with visuals on Twitter.
You can now add a combination of media to your Tweet on Android and iOS. That means you can include a photo, GIF, and video (or two!) all in the same Tweet. Tap the photo icon in the Tweet composer to start mixing your media. pic.twitter.com/9D1cCzjtmI
— Twitter Support (@TwitterSupport) October 5, 2022
ఇక ట్వీట్ చేసేప్పుడు 140 అక్షరాలుగా ఉన్న లిమిట్‌ను తాజాగా 280కి పెంచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్‌తో వీడియోలు, జిఫ్, ఇమేజ్‌లను ఒకేచోట చేర్చడం ద్వారా యూజర్లకు మరింత బెటర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని తెలిపారు. ఇక ఈ ఫీచర్‌తో గరిష్ఠంగా ఏవైనా నాలుగు ఫైల్స్‌ను అప్‌లోడ్‌చేసే వీలుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే ఈ తరహా ఫీచర్ ఉంది. ఫొటోను, వీడియోను ఒకే పోస్ట్‌లో పోస్ట్ చేసే వీలుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..