ప్రపంచంలోని అత్యంత సంపన్నుడైన ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ట్విట్టర్లో క్యారెక్టర్ లిమిట్ ఎత్తివేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్లాట్‌ఫామ్‌లో 280 అక్షరాల లిమిట్‌ను 4 వేల అక్షరాలకు పెంచనున్నట్లు ట్విట్టర్ సీఈవో మాస్క్ తెలిపారు. ఇటీవల యూజర్లు పదాల సంఖ్య పెంచాలని కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ట్విట్టర్‌లో కేవలం 280లోపు అక్షరాలతో మాత్రమే ట్వీట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు అక్షరాల సంఖ్య పెంచుతుంది. అయితే ట్విట్టర్‌ను మాస్క్ కొనుగోలు చేసిన తర్వాత ఈ క్యారెక్టర్ లిమిట్ మారుతుందా అని చాలా మంది యూజర్లు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఓ యూజర్ ట్విట్టర్‌లో క్యారెక్టర్ లిమిట్‌ను తొలగిస్తారా? లేదా? కనీసం క్యారెక్టర్ల సంఖ్య పెంచండి అంటూ ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన మాస్క్ తప్పకుండా పెంచుతామని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో క్యారెక్టర్‌ల సంఖ్య పెంచుతున్నట్లు ట్విట్టర్ తెలిపింది.
#Twitter CEO #ElonMusk has confirmed that the micro-blogging platform will increase the tweet character limit from 280 to 4,000. pic.twitter.com/o4CDrUCN7o
— IANS (@ians_india) December 12, 2022
కాగా, మొదట్లో కేవలం రూ.140 క్యారెక్టర్స్ మాత్రమే ఉండేది. తర్వాత దానిని 280కి పెంచింది. అయితే యూజర్ల కోరిక మేరకు ట్విట్టర్ 2017 సెప్టెంబర్‌లో ఆ సంఖ్యను రెండింతలు చేసింది. మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఉద్యోగుల తొలగింపుతో పాటు బ్లూ టిక్ వెరిఫికేషన్ వంటి నిర్ణయాలతో మస్క్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి