ప్రపంచవ్యాప్తంగా గూగుల్ అంటే ఓ క్రేజ్ ఉంది. మనం వాడే ఫోన్స్ దగ్గర నుంచి వివిధ అవసరాల కోసం ప్రతిఒక్కరూ గూగుల్‌పై ఆధారపడతారు. ప్రతి సంస్థ ప్రతి ఏడాది తన వార్షిక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తుంది. ఇందులో సంస్థ సాధించి అభివృద్ధిని పేర్కొనడంతో పాటు త్వరలో సంస్థ నుంచి రాబోయే వివిధ ఉత్పత్తల గురించి వివరాలు వెల్లడిస్తారు. ఈ నేపథ్యంలో గూగుల్ కూడా ఐఓ పేరుతో వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తుంది. ఇది కొన్ని వినియోగదారు కేంద్రీకృత ఉత్పత్తులను ఆవిష్కరించడంతో పాటు ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని కంపెనీ ఏ డెవలపర్ సొల్యూషన్‌లు, ఉత్పత్తులు, సాంకేతికతపై పని చేస్తుందో దాని ప్రివ్యూను పేర్కొంటుంది. ఈ సంవత్సరం ఈవెంట్‌పై టెక్ నిపుణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ ఈవెంట్ బహుళ విషయాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆండ్రాయిడ్ 14, పిక్సెల్ 7ఏ స్మార్ట్‌ఫోన్, అలాగే మొదటి ఫోల్డబుల్ ఫోన్ అయిన గూగుల్ ఫోల్డ్‌తో సహా వినియోగదారులకు మేలు చేసే వివిధ ఉత్పత్తులను గూగుల్ లాంచ్ చేసే అవకాశం ఉంది. మే 10న భారతదేశంలో ఈ ఈవెంట్ రాత్రి 10:30కు నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ యూట్యూబ్ లైవ్‌లో ప్రసారం చేస్తారు. ఈ ఈవెంట్ కంపెనీ ఏం ప్రొడెక్ట్స్ లాంచ్ చేస్తుందో? ఓ సారి చూద్దాం.
ఈ సంవత్సరం గూగుల్ ఐఓ పిక్సెల్ ఫోల్డ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసే అవకాశం ఉంది. గూగుల్ ఇప్పటికే సోషల్ మీడియా ఛానెల్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్‌కు మంచి పోటీనివ్వనుంది. వెనుకవైపు మూడు కెమెరాలతో విజర్ కెమెరా మాడ్యూల్‌తో వస్తుంది. ఈ ఫోన్ 5.8 అంగుళాల కవర్డ్ డిస్‌ప్లే, 7.6 అంగుళాల ఫోల్డబుల్ ప్యానెల్‌తో వస్తుంది. గూగుల్ టెన్సార్ జీ2 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ధర 1700 డాలర్ల వరకూ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
గూగుల్ వార్షిక ఈవెంట్‌లో పిక్సెల్ 7ఏని ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ఫోన్ మే 11 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ పిక్సెల్ 7ఏ గతేడాది లాంచ్ చేసిన పిక్సెల్ 7కు అప్‌డేట్ వెర్షన్ అని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఫోన్ 6.1 అంగుళాల డిస్‌ప్లేతో గూగుల్ టెన్సార్ జీ2 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 13, డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది.
మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ గూగుల్ ఇప్పుడు అప్‌డేట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 14 పేరుతో అప్‌డేట్ వెర్షన్‌ను వినియోగదారులకు అందించనున్నారు. ఈ అప్‌డేట్‌లో గూగుల్ పాస్ కీ మద్దతు, అలాగే మెరుగైన బ్యాటరీ లైఫ్, సెక్యూరిటీ అప్‌డేట్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. అయితే ఈ అప్‌డేటెడ్ వెర్షన్ ఆగస్టు నుంచి అందుబాటులోకి వస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రస్తుతం ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) శాసిస్తుంది. ప్రస్తుతం ఏఐ కోసం గూగుల్ కూడా పెట్టుబడులు పెట్టింది. అయితే మెరుగైన ఫలితాల కోసం వంద కంటే ఎక్కువ భాషలున్న యూనిఫైడ్ లాంగ్వేజ్ మోడల్‌ను ఈ ఈవెంట్‌లో ప్రదర్శించవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..