AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elections: ఎన్నికల వేళ గూగుల్‌ కీలక నిర్ణయం.. గూగుల్‌తో కలిసి..

తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు కొన్ని చర్యలు చేపట్టింది. అధీకృత సమాచారం మాత్రమే ప్రజల్లోకి వెళ్లేలా చూడడంతో పాటు ఏఐని వినియోగించి రూపొందించే వీడియోలకు లేబుల్ వేయాలని నిర్ణయించింది. ఈ విషయమై గూగుల్‌ తన బ్లాగ్‌లో పోస్ట్ చేస్తూ.. ఎన్నికల్లో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం...

Elections: ఎన్నికల వేళ గూగుల్‌ కీలక నిర్ణయం.. గూగుల్‌తో కలిసి..
Google
Narender Vaitla
|

Updated on: Mar 12, 2024 | 8:35 PM

Share

ఎన్నికలు సమీపిస్తున్న వేళ గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘంతో గూగుల్‌ ఒప్పందం చేసుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తప్పుడు సమాచారాన్ని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంది. సాంకేతిక విప్లవంతో వచ్చిన ఏఐ టెక్నాలజీ దుర్వినియోగమవుతోన్న విషయం తెలిసిందే. ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్‌ ఫొటోలు, వీడియోలను వైరల్‌ చేస్తున్నారు. డీప్‌ ఫేక్‌ వంటి వీడియోలకు చెక్‌ పెట్టేందుకే గూగుల్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు కొన్ని చర్యలు చేపట్టింది. అధీకృత సమాచారం మాత్రమే ప్రజల్లోకి వెళ్లేలా చూడడంతో పాటు ఏఐని వినియోగించి రూపొందించే వీడియోలకు లేబుల్ వేయాలని నిర్ణయించింది. ఈ విషయమై గూగుల్‌ తన బ్లాగ్‌లో పోస్ట్ చేస్తూ.. ఎన్నికల్లో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాసుకొచ్చింది. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు వచ్చే సందేహాలైన.. ఓటరుగా పేరు ఎలా నమోదు చేసుకోవాలి? ఎలా ఓటు వేయాలి? వంటి సమాచారాన్ని సులువుగా తెలుసుకోవడం కోసం ఈసీతో జట్టు కట్టినట్లు గూగుల్‌ తెలిపింది.

ఈ ఇన్ఫర్మేషన్‌ను ఇంగ్లీష్, హిందీ భాషల్లో లభించనుంది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి రూపొందించే కంటెంట్‌ను సులభంగా గుర్తించే విధానాన్ని తీసుకొచ్చినట్లు గూగుల్‌ తెలిపింది. డీప్‌ఫేక్‌, మార్ఫింగ్‌ చేసిన మీడియాను కట్టడి చేసినట్లు గూగుల్‌ తెలిపింది. ఇదంఉలో భాగంగానే యూట్యూబ్‌లోని ఏఐ ఫీచర్లతో క్రియేట్‌ చేసిన కంటెంట్‌కు ఇప్పటికే లేబుల్‌ వేయడం ప్రారంభించామని వెల్లడించింది. ఏఐ జెమినిపై వస్తున్న విమర్శల నేపథ్యంలో గూగుల్‌ మరో నిర్ణయం కూడా తీసుకుంది.

ఎన్నికలకు సంబంధించిన సమాచారం ఇవ్వకుండా గూగుల్‌ ఆంక్షలు విధించింది. ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసే ఫేక్‌ సమాచారం, హింసను ప్రేరేపించే సమచారం, విద్వేష వ్యాఖ్యల విషయంలో గూగుల్‌ పాలసీని తీసుకొచ్చింది. ఒకవేళ పాలసీకి వ్యతిరేకంగా ఉన్న కంటెంట్‌ను తొలగించేందుకు గానూ మనుషులతో పాటు మెషిన్‌ లెర్నింగ్‌ను కూడా వినియోగించనున్నట్లు గూగుల్ తెలిపింది. అంతేకాకుండా ఎన్నికలకు సంబంధించిన ప్రకటనల మీద కూడా కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు గూగుల్ పేర్కొంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..