- Telugu News Photo Gallery Technology photos 5 Best smartwatches under 10K Check here for features and price details
Smart watch: కళ్లు చెదిరే ఫీచర్లతో అద్భుతమైన స్మార్ట్ వాచ్‌లు.. రూ. 10 వేలలోపు ధరతో..
ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ వాచ్ ల హవా కొనసాగుతోంది. వెయ్యి రూపాయలకే స్మార్ట్ వాచ్ లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే వీటిలో పరిమితమైన ఫీచర్లు మాత్రమే ఉంటాయి. అలా కాకుండా మంచి అధునాతన ఫీచర్లతో రూ. 10వేలలోపు ధరలో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ స్మార్ట్ వాచ్ లు.? వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Mar 12, 2024 | 11:29 PM

Amazfit GTS 4 Mini Smart Watch: ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 7,999గా ఉంది. ఈ వాచ్‌లో 120కిపైగా స్పోర్ట్స్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. 24 గంటల హార్ట్ రేట్ మానిటరింగ్ ఈ వాచ్ సొంతం. ఇక ఈ వాచ్‌లో 1.65 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 5ఏటీఎమ్ వాటర్ రెసిస్టెన్సతో స్విమ్‌ప్రూఫ్ అందించారు.

ColorFit Pro 5: ఇక తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ స్మార్ట్ వాచ్‌లో కలర్‌ఫిట్ ప్రో 5 ఒకటి. ఈ స్మార్ట్ వాచ్‌లో 1.96 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. ఇందులో హార్ట్‌రేట్, ఎస్‌పీఓ2 వంటి హెల్త్ ఫీచర్లను అందించారు. ఈ వాచ్ ధరను రూ. 5,499గా నిర్ణయించారు.

Fossil Gen 6 Smartwatch: రూ. 10 వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ వాచ్‌లలో ఫాజిల్ కంపెనీకి చెందిన ఈ వాచ్ ఒకటి. ఈ వాచ్ ధర రూ. 9,598గా ఉంది. ఇందులో జీపీఎస్ ట్రాకర్, ఎస్‌ఓ2 వంటి హెల్త్ ఫీచర్లను అందించారు. 45 వాట్స్ బ్యాటరీతో రూపొందించిన ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 24 గంటలు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంది.

Samsung Galaxy Watch4 Bluetooth: సామంగ్ వాచ్ ధర రూ. 9,999గా ఉంది. ఇందులో ఎన్నో హెల్త్ ట్రాకింగ్ పీచర్లను అందించారు. హార్టరేట్ సెన్సార్, బీపీ సెన్సార్ వంటి ఎన్నో అధునాతన ఫీచర్లను ఇందులో అందించారు. ఈ వాచ్ 90కిపైగా వర్క్ మోడ్స్‌కు సపోర్ట్ చేస్తుంది.

Titan Crest Premium Mesh Strap Smartwatch: రూ. 10 వేలలో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ వాచ్ లలో ఇదీ ఒకటి. ఈ వాచ్ ధర రూ. 7,994గా ఉంది. ఇందులో 1.43 ఇంచెస్‌తో కూడిన స్టాండింగ్ స్క్రీన్ డిస్‌ప్లేను అందింఆచరు. అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే ఈ వాచ్ సొంతం. ఈ వాచ్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 5 రోజుల పాటు పనిచేస్తుంది. 100కి పైగా వాచ్ ఫేస్‌లు ఇందులో ఇచ్చారు.




