Moon Surface: చంద్రుడికి ముప్పు.. ఉపరితలాన్ని ఢీకొట్టనున్న 3 టన్నుల వ్యర్థాలు..!

Moon Surface: అంతరిక్షంలో తిరుగుతున్న ఓ రాకెట్‌ (Rocket) శకలం నుంచి దాదాపు 3 టన్నుల వ్యర్థాలు (Garbage) చంద్రుడిని ఢీకొట్పైటే అవకాశాలున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు..

Moon Surface: చంద్రుడికి ముప్పు.. ఉపరితలాన్ని ఢీకొట్టనున్న 3 టన్నుల వ్యర్థాలు..!
Moon Surface

Updated on: Mar 04, 2022 | 8:36 AM

Moon Surface: అంతరిక్షంలో తిరుగుతున్న ఓ రాకెట్‌ (Rocket) శకలం నుంచి దాదాపు 3 టన్నుల వ్యర్థాలు (Garbage) చంద్రుడిని ఢీకొట్టే అవకాశాలున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు (Astronomer) తెలిపారు. అంతరిక్షంలో తిరుగుతున్న ఓ రాకెట్‌ శకలం.. శుక్రవారం చంద్రుడి (Moon)కి అతి సమీపం నుంచి దూసుకెళ్లనుంది. దీంతో ఆ వ్యర్థాలు చంద్రుడి ఉపరితలంపై పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే గంటకు 9,300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనున్నట్లు వెల్లడిస్తున్నారు శాస్త్రవేత్తలు (Scientists). అది వెళ్లే వేగానికి చంద్రుడి ఉపరితలంపై కొన్ని వందల కిలోమీటర్ల మేర చంద్ర ధూళి ఎగుస్తున్నట్లు గుర్తించారు. దీని కారణంగా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు.

దాదాపు 3 టన్నుల వ్యర్థాలు చంద్రుడి చుట్టూ ఓ బలమైన గోడలా పేరుకుపోతూ ఈ శకలం దూసుకొచ్చిన వేగానికి ఆ గోడకు 33 అడుగుల నుంచి 66 అడుగుల లోతైనా బిలం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. దీని ప్రభావాన్ని తెలుసుకునేందుకు పరిశోధనలు కొనసాగుతున్నాయి. పూర్తి పరిశోధన సాగాలంటే కొన్ని వారాల సమయం పట్టవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భూమికి సమీపంలో తిరిగే గ్రహశకలాల దిశ, గతిని నిరంతరం కనిపెట్టి టెలిస్కోపుల నుంచి కూడా జడ దొరికే అవకాశం లేదంటున్నారు. కాగా, అంతరిక్ష పరిశోధనల కోసం దశాబ్దాల కిందట చైనా ప్రయోగించిన రాకెట్‌ అని శాస్త్రవేత్తలు చెబుతుండగా, తమది కాదని చైనా చెబుతోంది. 2014లో చంద్రుడిపైకి చైనా అంతరిక్ష నౌకను మోసుకెళ్లిన రాకెట్‌ అని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Sleeping: వయసు పెరిగే కొద్దీ నిద్రలేమి సమస్య ఎందుకు వస్తుంది? పరిశోధనలలో కీలక విషయాలు

Dizo Watch 2 Sports: భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌ వాచ్‌ వచ్చేస్తోంది.. ఆకట్టుకుంటోన్న ఫీచర్లు..