Aadhaar Update: సులభంగా, వేగంగా ఆధార్ అప్ డేట్.. పది రకాల సేవలు ఈజీగా పొందవచ్చు..

|

Jul 22, 2023 | 7:17 PM

ఆధార్ కార్డులో వివరాలు పక్కాగా ఉండాలి. ఒకవేళ సరిగ్గా లేకపోతే అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు దానిలోని డేటాను సరిచూసుకోవడం, అప్ డేట్ చేసుకోవడం ముఖ్యం. చిరునామా లేదా ఫోన్ నంబర్‌లో ఏదైనా మార్పు మీ ఆధార్ కార్డ్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు.

Aadhaar Update: సులభంగా, వేగంగా ఆధార్ అప్ డేట్.. పది రకాల సేవలు ఈజీగా పొందవచ్చు..
Aadhaar
Follow us on

ఆధార్ కార్డు అనేది ప్రతి భారతీయ పౌరుడికి అవసరం. ఇది ఉంటే గానీ ఏ సేవను మనం పొందలేం. ప్రభుత్వం నుంచి కూడా ఏ పథకం పొందాలన్న ఈ ఆధార్ కార్డు తప్పనిసరి. ఇది లేకుండా కనీసం బ్యాంకు అకౌంట్ కూడా మీరు ప్రారంభించలేరు. అటువంటి ఆధార్ కార్డులో వివరాలు పక్కాగా ఉండాలి. ఒకవేళ సరిగ్గా లేకపోతే అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు దానిలోని డేటాను సరిచూసుకోవడం, అప్ డేట్ చేసుకోవడం ముఖ్యం. చిరునామా లేదా ఫోన్ నంబర్‌లో ఏదైనా మార్పు మీ ఆధార్ కార్డ్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డును యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) జారీ చేస్తుంది. భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్‌పై బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేయాలని ప్రభుత్వం ఆధార్ కార్డ్ హోల్డర్‌లకు సలహా ఇస్తుంది. ఇది ఆన్‌లైన్‌లో చేయడం సాధ్యం కాదు, ఆధార్ కార్డ్ హోల్డర్లు దీని కోసం ఆధార్ సేవా కేంద్రాలను సందర్శించాలి. అయితే ఆధార్ సేవా కేంద్రాలలో చిరునామాను అప్ డేట్ చేసుకోవడానికి మీరు రూ. 50 జీఎస్టీతో చెల్లించాల్సి ఉంటుంది.

ఈ అంశాలను మీరు అప్ డేట్ చేసుకోవచ్చు..

యూఐడీఏఐ వెబ్‌సైట్ ద్వారా పౌరులు తమ ఆధార్ కార్డ్‌లలో చిరునామాలను మార్చుకోవచ్చు. పౌరులకు చెల్లుబాటు అయ్యే చిరునామా ప్రూఫ్ లేదా చిరునామా ధ్రువీకరణ లేఖ (చెల్లుబాటు అయ్యే చిరునామా రుజువు లేని వారికి) అవసరం. ఆధార్‌లో మీ చిరునామాను అప్ డేట్ చేయడానికి ఇవి తప్పనిసరి.

ఇవి కూడా చదవండి
  • ఆధార్‌లో చేసిన ఏదైనా అప్‌డేట్/మార్పు స్థితిని తనిఖీ చేసుకోవచ్చు. ఇందులో ఆధార్ సేవా కేంద్రంలో చేసిన మార్పులు/నవీకరణలు ఉంటాయి.
  • మీరు మీ ఆధార్‌లో చేసిన అప్‌డేట్‌ల వివరాలను కూడా చూడవచ్చు. దీన్ని ‘ఆధార్ అప్‌డేట్ హిస్టరీ’లో చేయవచ్చు.
  • ఆధార్ పివిసి కార్డును ఆర్డర్ చేసుకోవచ్చు.
  • సమీపంలోని ఆధార్ సేవా కేంద్రాన్ని గుర్తించవచ్చు.
  • ఆధార్ సేవా కేంద్రానికి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు.
  •  మీ ఆధార్ కార్డ్ చెల్లుబాటును తనిఖీ చేయొచ్చు.
  • మీరు ఇ-ఆధార్‌ని ఎం-ఆధార్‌ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ ఉన్న ఎవరైనా ఎం-ఆధార్‌ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి ఉపయోగించవచ్చు.
  • ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేకుండా నివాసి ఆర్డర్ ఆధార్ రీప్రింట్, లొకేట్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్, వెరిఫై ఆధార్, స్కానింగ్ క్యూఆర్ కోడ్ వంటి కొన్ని సేవలను మాత్రమే దీనిలో పొందగలుగుతారు. అయితే, ఎం-ఆధార్‌ లో ప్రొఫైల్‌ను రూపొందించడానికి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ తప్పనిసరి. ఎం-ఆధార్‌ లో ప్రొఫైల్‌ను సృష్టించడం కోసం వారి రిజిస్టర్డ్ మొబైల్‌కు మాత్రమే ఓటీపీ వస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..