Garmin Forerunner: మార్కెట్‌లోకి మూడు స్మార్ట్ వాచ్‌లను విడుదల చేసిన యూఎస్ కంపెనీ.. ధర తెలిస్తే షాక్ అవుతారంతే..!

|

May 01, 2023 | 7:15 PM

తాజాగా యూఎస్ ఆధారిత ప్రీమియం స్మార్ట్ వాచ్ కంపెనీ గార్మిన్ భారతదేశంలో అధిక-రిజల్యూషన్ ఎమో ఎల్ఈడీ డిస్‌ప్లేతో రెండు స్మార్ట్ వాచ్‌లను రిలీజ్ చేస్తుంది. ఫోర్రన్నర్ 965, ఫోర్రన్నర్ 265 స్మార్ట్‌వాచ్ సిరీస్‌లను విడుదల చేస్తున్నట్లు కంపెనీ తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది.

Garmin Forerunner: మార్కెట్‌లోకి మూడు స్మార్ట్ వాచ్‌లను విడుదల చేసిన యూఎస్ కంపెనీ.. ధర తెలిస్తే షాక్ అవుతారంతే..!
Garmin Forerunner 965
Follow us on

దేశంలో యువత ఎక్కువ ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో కంపెనీలు కూడా యువతను ఆకట్టుకోవడాన్ని కొత్త మోడల్స్ వాచ్‌లను రిలీజ్ చేస్తున్నాయి. ఇతర దేశ కంపెనీలు కూడా భారత్‌లో విపరీతంగా ఉన్న నేపథ్యంలో వారి మోడల్స్‌ను అందుబాటులో ఉంచుతున్నాయి. తాజాగా యూఎస్ ఆధారిత ప్రీమియం స్మార్ట్ వాచ్ కంపెనీ గార్మిన్ భారతదేశంలో అధిక-రిజల్యూషన్ ఎమో ఎల్ఈడీ డిస్‌ప్లేతో మూడు స్మార్ట్ వాచ్‌లను రిలీజ్ చేస్తుంది. ఫోర్రన్నర్ 965, ఫోర్రన్నర్ 265 స్మార్ట్‌వాచ్ సిరీస్‌లను విడుదల చేస్తున్నట్లు కంపెనీ తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. జీపీఎస్ రన్నింగ్ స్మార్ట్‌వాచ్‌‌ల్లో ఒత్తిడి, నిద్ర, గరిష్ట ఆక్సిజన్ వినియోగం వంటి ట్రాకింగ్ ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ ప్రతినిధులు పేర్కొన్న వివరాలు ప్రకారం గార్మిన్ ఫోర్రన్నర్ 965 ధర ధర రూ. 67,490 ఉంటే ఫోర్రన్నర్ 265 ధర రూ.50,490గా ఉంది. బ్లాక్, ఆక్వా కలర్ ఆప్షనల్లో వినియోగదారలకు అందుబాటులో ఉంటుంది. మరోవైపు మూడో ఫోర్రన్నర్ 265 ఎస్ మ్యూజిక్ స్మార్ట్‌వాచ్ ధర రూ.50,490 కంపెనీ నిర్ణయించింది. ఇది నలుపు, పింక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. 

ఈ మూడు స్మార్ట్‌వాచ్‌లు ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌ అయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, టాటా క్లిక్, టాటా లగ్జరీ, సినర్జైజర్, భవార్, నైకా వంటి ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఫోర్రన్నర్ 965లో 1.4 అంగుళాల ఎమో ఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. అలాగే స్మార్ట్‌వాచ్ 23 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. అలాగే జీపీఎస్ మోడ్‌లో 31 గంటల వరకు ఉంటుంది. ఫోర్రన్నర్ 965లో హెచ్‌ఆర్ సెన్సార్, ఎస్‌పీఓ2 సెన్సార్, స్ట్రెస్ మానిటర్, స్లీప్ ట్రాకింగ్ వంటి వివిధ ఆరోగ్య పర్యవేక్షణ ఫీచర్లు ఉన్నాయి. అదనంగా, ఇది స్మార్ట్ ఫీచర్ల కోసం బ్లూటూత్, వైఫై కనెక్టివిటీని అందిస్తుంది. స్పోర్ట్స్, ఫిట్‌నెస్ మోడ్‌లు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి.  అలాగే ఫోర్రన్నర్ 265 ఒక గ్రౌండ్ గొరిల్లా గ్లాస్ 4 లెన్స్‌తో వస్తుంది. 1.3 అంగుళాల ఎమో ఎల్ఈడీ డిస్‌ప్లే ఎంపికతో వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ 13 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. జీపీఎస్ మోడ్‌లో 20 గంటల వరకు ఉంటుంది.

ఫోర్రన్నర్ 265లో గార్మిన్ ఫస్ట్‌బీట్ అనలిటిక్స్ నుంచి వీఓ2 వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్‌లో 30కి పైగా స్పోర్ట్ ప్రొఫైల్‌లు, ప్రత్యేకమైన ట్రయాథ్లాన్ మోడ్ కూడా ఉన్నాయి.ఈ మూడు వాచీలు స్టామినా, అక్యూట్ క్రానిక్ వర్క్‌లోడ్ రేషియో ఫీచర్‌లతో  లోడ్ చేశారు. అలాగే వినియోగదారులు పరుగులో వారి శారీరక శ్రమను నిర్వహించడంలో సహాయపడతాయి. ఫోర్రన్నర్ మ్యూజిక్ వాచ్ ఫోన్-ఫ్రీ లిజనింగ్ కోసం మీ స్పాటిఫై, డీజెర్, అమెజాన్ మ్యూజిక్ ఖాతాల నుంచి పాటలు, ప్లేజాబితాలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..