Ant Bite: చిన్న చీమ కుడితే భరించలేని నొప్పి ఎందుకు వస్తుందో తెలుసా? చీమల దంతాల వెనుక వున్న సీక్రెట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు
చీమ కుట్టిందంటే చుర చుర మంటుంది. కొన్నిరకాల చీమలు కుట్టాయంటే దానివలన వచ్చే నొప్పి కొద్దిసేపు చాలా ఇబ్బంది పెడుతుంది. అసలు చీమలు కుడితే ఇంత నొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?
Ant Bite: చీమ కుట్టిందంటే చుర చుర మంటుంది. కొన్నిరకాల చీమలు కుట్టాయంటే దానివలన వచ్చే నొప్పి కొద్దిసేపు చాలా ఇబ్బంది పెడుతుంది. అసలు చీమలు కుడితే ఇంత నొప్పి ఎందుకు వస్తుందో తెలుసా? చిన్న చీమ కుడితే తట్టుకోలేనంత బాధ ఒక్కోసారి ఎందుకు కలుగుతుంది అనే విషయంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. చీమలు కుడితే నొప్పి రావడానికి కారణం ఏమిటో తెల్సుకున్నారు. అదేమిటో ఇక్కడ తెలుసుకుందాం. చీమ కాటు కారణంగా ఇంత పదునైన నొప్పి ఎందుకు వస్తుందో శాస్త్రవేత్తలు కారణం చెప్పారు. చీమ పళ్ళు జింక్‌తో తయారయ్యాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అవి మానవ జుట్టు కంటే మెరుగ్గా ఉంటాయి. అవి చాలా పదునైనవి, అవి గట్టి ఆకులను కూడా కత్తిరించగలవు. వాటి దంతాలు వారి శరీర బరువులో 8 శాతం బరువుగా ఉంటాయి.
ఒరెగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చీమల దంతాలపై పరిశోధన చేశారు. చీమ శరీరం నుండి బయటకు వచ్చిన పళ్ళు ఇవి. ఈ దంతాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడం పరిశోధన లక్ష్యం. పరిశోధన సమయంలో, దంతాలు జింక్‌తో తయారు అయ్యాయని తెలియడంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు.
జింక్ బలాన్ని ఇస్తుంది..
చీమలపై చేసిన శోధనలో తెలిసిన విషయాలతో శాస్త్రవేత్తలు కొత్త పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. చీమల దంతాల వలె ఉండే బలమైన సాధనాలను తయారు చేయవచ్చా అని తెలుసుకోవడానికి ప్రయత్నిసున్నారు. పరిశోధకుడు రాబర్ట్ స్కోఫీల్డ్ మాట్లాడుతూ ”చీమల దంతాల లక్షణాల నుండి అనేక విషయాలు అర్థమయ్యాయి. ఉదాహరణకు, మీరు ప్లాస్టిక్ లేదా అల్యూమినియం మీద జింక్ పొరను ఉంచినట్లయితే, అది చాలా కఠినమైన పదార్ధంగా మారుతుంది.” అని వివరించారు.
ఎలక్ట్రానిక్ వస్తువులలో..
పరిశోధకుడు దేవరాజ్ మాట్లాడుతూ, ”టెక్నాలజీ సహాయంతో, జింక్ పొర చీమల దంతాలలో ఎలా నిక్షిప్తమై ఉంది? దంతాలు ఎలా బలంగా తయారవుతాయో తెలుసుకోవాలనుకుంటున్నాము. జింక్ అణువులు చీమల దంతాలను దానిని బలోపేతం చేస్తాయని, అందువల్లే చీమలు కుట్టినపుడు నొప్పి వస్తుందనీ పరిశోధనలో వెల్లడైంది. దీనిఆధారంగా మరిన్ని పరిశోధనలు చేస్తే.. జింక్ అణువులతో ధృడమైన ఎలక్ట్రానిక్స్ వస్తువులను తయారు చేయవచ్చు.” అని అన్నారు.
చీమల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
కలిసికట్టుగా జీవించడంలో, పనులను విభజించుకోవడంలో చీమలను మించినవి లేవు. ఒకో పుట్టలో 80 లక్షల దాకా నివసిస్తాయి. రాణి చీమలు, శ్రామిక చీమలు, సైనిక చీమలు, కాపలా చీమలు. ఇలా వేటి పని వాటిదే. రెక్కలు ఉండే రాణి చీమ గుడ్లు పెట్టడం తప్ప మరేపని చేయదు. మగ చీమలు రాణి చీమలతో జత కలిశాక వెంటనే చనిపోతాయి. ఇక రాణికి సేవలు చేసేవేమో శ్రామిక చీమలు. ఇవి రాణి చీమ శరీరం నుంచి వచ్చే రసాయనాన్ని రుచి చూసి, దాని ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుంటాయి. గుడ్లను కాపాడడం, అవి లార్వా దశ నుంచి పిల్లలుగా మారి పెద్దయ్యే వరకు కనిపెట్టుకొని ఉంటాయి. పుట్టను కాపాడే పని సైనిక చీమలది. శత్రువులు దాడి చేశారని తెలియగానే కాపలా చీమలు ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయి. వాటిని పసిగట్టగానే సైనిక చీమలు ఒక్క పెట్టున దాడికి దిగుతాయి.
Also Read: WhatsApp: నవంబర్ 1నుంచి ఈ ఫోన్‌లలో వాట్సాప్ పని చేయదు.. ఇందులో మీ మొబైల్ ఉందేమో చూసుకోండి.